రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు - అధికారుల కీలక సూచనలు..!!
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు ఏపీ వ్యాప్తంగా పరీక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు 7, 25,620 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6,23,092 మంది ఉండగా.. గత ఏడాది ఫెయిలై అయిన విద్యార్ధులు 1,02,528 మంది ఉన్నారు. లీకేజీలను అరికట్టేందుకు ప్రశ్నాపత్రానికి ప్రత్యేక యూనిక్ కోడ్ నంబర్ ప్రింట్ చేశారు.
సర్వం సిద్దం
రేపు (మార్చి 18) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్య పదో తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,473 ఎగ్జాం సెంటర్లను విద్యాశాఖ సిద్ధం చేసింది. ప్రధాన పరీక్షలు 28వ తేదీతో ముగియనుండగా.. మిగతా రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధించారు. 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఉదయం 8.45 నిమిషాల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. హాల్ టిక్కెట్లు చూపితే ఆర్టీసీ బస్సులో టెన్త్ విద్యార్ధులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించారు.

ప్రత్యేక ఏర్పాట్లు
రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు. 0866-2974540 నంబర్ తో ఈ కంట్రోల్ రూమ్ నిర్వహిస్తున్నారు. ప్రతీ జిల్లాలో కలెక్టర్లు, డిఇఓల పర్యవేక్షణలో జిల్లా స్ధాయి కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాకి ఒక పరిశీలకుడు, రాష్ట్ర వ్యాప్తంగా 156 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లు, 3473 చీఫ్ సూపరింటెండెంట్లు, 35,119 మంది ఇన్విజలేటర్లు, 3473 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించారు. పరీక్షల అనంతరం ఈ నెల 31 నుంచే టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ జరపనున్నారు. తెలంగాణలోనూ మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది.
కీలక సూచనలు
పరీక్షా కేంద్రాలకు ప్రారంభమవుతుంది. గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు. ఒక్క నిమిషం నిబంధనను ఎత్తివేసి 5 నిమిషాల గ్రేస్ టైం ఇచ్చినట్లు ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. దీంతో 9.35 నిమిషాల వరకు విద్యార్ధులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. మొత్తం 2,676 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. వేసవి కాలం..ఎండల తీవ్రత పెరుగుతున్న వేళ పరీక్షా కేంద్రాల్లో అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్దమైనట్లు అధికారులు వెల్లడించారు.
-
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications