AP IAS Transfers: ఏపీలో మళ్లీ భారీగా ఐఏఎస్ ల బదిలీ-కలెక్టర్ల సహా 11 మందికి స్ధాన చలనం..!

ఏపీలో ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేసింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలక విభాగాల్లో పనిచేస్తున్న అధికారులతో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లను వరుసగా బదిలీలు చేస్తున్నారు. ఇప్పటికే ఇలా రెండు, మూడు సార్లు బదిలీలు జరిగాయి. ఇవాళ మరోసారి 11 మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ బదిలీ అయిన వారిలో పలు జిల్లాల కలెక్టర్లు కూడా ఉన్నారు.

11 IAS officers transferred in Andhra Pradesh including district colletors- here is list

ఇవాళ బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల్లో విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా ఉన్న స్వప్నిల్ దినకర్ ను శ్రీకాకుళం కలెక్టర్ గా మార్చారు. పల్నాడు జిల్లా జేసీగా ఉన్న శ్యామ్ ప్రసాద్ ను అక్కడి నుంచి బదిలీ చేసి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గా అవకాశం కల్పించారు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఉన్న విజయను అనకాపల్లి జిల్లా కలెక్టర్ గా నియమించారు. ఏపీస్వేరీస్ కార్యదర్శిగా ఉన్న మహేష్ కుమార్ రావిరాలను అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు.

సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబును పల్నాడు జిల్లా కలెక్టర్ గా నియమించారు. విశాఖ జాయింట్ కమిషనర్ గా ఉన్న ఆనంద్ ను నెల్లూరు కలెక్టర్ గా బదిలీ చేశారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్ గా ఉన్న వెంకటేశ్వర్ కు తిరుపతి కలెక్టర్ గా బదిలీ చేశారు. బాపట్ల జేసీగా ఉన్న చామకూర శ్రీధర్ ను అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న శివశంకర్ ను వైఎస్సార్ జిల్లా కలెక్టర్ గా పంపారు. ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీ చేతన్ ను సత్యసాయి జిల్లా కలెక్టర్ గా నియమించారు. గుంటూరు జేసీ రాజకుమారిని నంద్యాల కలెక్టర్ గా బదిలీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+