ఏపీలో భారీగా తగ్గిన కొత్త కరోనా కేసులు, టెస్టులు కూడా: 100 దిగువకు మరణాలు, జిల్లాలవారీగా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 15వేలలోపే కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. అంతేగాక, కరోనా మహమ్మారితో మరణించినవారి సంఖ్య కూడా వందకు దిగువగానే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 58,835 నమూనాలను పరీక్షించగా.. 12,994 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 12,994 కరోనా కేసులు, 96 మరణాలు
తాజాగా నమోదైన 12,994 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,93,821కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 96 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది మృతి చెందారు.
కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 10 మంది, అనంతపురంలో 9 మంది, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో 8 మంది, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 10,222కు చేరింది.

ఏపీలో రికవరీలు పెరగడంతో స్వల్పంగా తగ్గిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 18,,373 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 13,79,837కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,86,76,222 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2652 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కృష్ణాల 274 మంది కరోనా బారినపడ్డారు.
Recommended Video

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 1047, చిత్తూరులో 1620, తూర్పుగోదావరిలో 2652, గుంటూరులో 670, కడపలో 874, కృష్ణాలో 274, కర్నూలులో 856, నెల్లూరులో 503, ప్రకాశంలో 703, శ్రీకాకుళంలో 864, విశాఖపట్నంలో 1690, విజయనగరంలో 535, పశ్చిమగోదావరిలో 706 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలను అనుమతిస్తున్నారు. వాహనాల రాకపోకలు కూడా 12 గంటలవరకే అనుమతిస్తున్నారు. తాజాగా, బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక యాస్ తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications