నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘తీవ్ర ముప్పు’ కేటగిరిలో ఏపీ మూడు జిల్లాలు: ఐఎండి స్టడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉష్ణమండల తుఫానులకు సంబంధించి దేశంలోని 4తూర్పుతీర రాష్ట్రాల్లోని 12 జిల్లాలు ‘అత్యంత తీవ్ర ముప్పు' కేటగిరీలో ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధ్యయనం వెల్లడించింది. ఐఎండి అధ్యయనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి.

ఏపితోపాటు ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్‌లో 4, తమిళనాడులో ఒక జిల్లా ఈ జాబితాలో ఉన్నాయి. వీటితోపాటు భౌగోళికంగా ఏపీలో ఉన్నా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ‘యానాం' కూడా ఇందులోనే ఉంది. మొత్తంమీద 13 తీర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 41 జిల్లాలు తుపానుల నుంచి ‘తీవ్ర ముప్పు' కేటగిరీలో ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.

andhra pradesh

మరో 96 జిల్లాలపై నిర్వహించిన అధ్యయనంలో 30 జిల్లాలు ‘ఓ మోస్తరు ముప్పు', మరో 13 ‘తక్కువ ముప్పు' కేటగిరీలలోకి వచ్చాయి. దేశంలో 1891 నుంచి 2010 మధ్య సంభవించిన తుపానుల గణాంకాలను విశ్లేషించి ఈ మేరకు తేల్చినట్లు ఐఎండీ తుఫాను హెచ్చరికల విభాగం అధిపతి మృత్యుంజయ్‌ మహాపాత్ర చెప్పారు.

ప్రపంచంలో సంభవించే ఉష్ణమండల తుపానులలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో పుట్టేవి 7 శాతం మాత్రమేనన్నారు. అయినప్పటికీ వాటి ప్రభావం, తీవ్రత తీరప్రాంత జిల్లాలపై అత్యంత అధికంగా ఉంటుందని తెలిపారు.

English summary
12 districts, all on the east coast, are "very highly prone" and 41 "highly prone" to cyclones in the country, a paper by the India Meteorological Department (IMD) scientist has revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X