సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం: 25పూరిళ్లు దగ్ధం, వీధినపడ్డ కుటుంబాలు
కర్నూలు: జిల్లాలోని ధర్మపేటలోని ఓ ఇంట్లో శనివారం గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడి పడటంతో సమీంలోని 25 పూరిళ్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
కట్టుబట్టలతో బయటపడ్డామని బాధితులు విలపిస్తున్నారు. పెళ్లి కోసం దాచిన రూ. 1.50లక్షలు, బంగారం మొత్తం పోయాయని ఓ బాధిత కుటుంబం వాపోయింది. తమ ఇళ్లు దగ్ధం కావడంతో రోడ్డున పడ్డామని బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.
ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.

అంగన్‌వాడి టీచర్ అనుమానాస్పద మృతి
అంగన్‌వాడి టీచర్‌గా పనిచేస్తున్న ఓ వివాహిత అనుమానాస్ప స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం థాన అన్నవరం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. థాన అన్నవరం గ్రామానికి చెందిన స్వప్న(35) అంగన్‌వాడి టీచర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
శనివారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని మృతి చెందింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
కాగా, మృతురాలి వంటిపై గాయాలు ఉండటంతో పాటు.. ఇంట్లో అక్కడక్కడ రక్తపు మరకలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
విశాఖలో గొలుసు దొంగ ఎల్లాజీ అరెస్టు
గొలుసు దొంగ ఎల్లాజీని విశాఖ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 440 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications