విశాఖలో కీచక సీఐ, యువతిపై అత్యాచార యత్నం, వీడియో తీసి చుక్కలు చూపించిన యువతి

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: ఓ సమస్యపై తన వద్దకు వచ్చిన యువతికి అండగా నిలబడాల్సిందిపోయి.. అదను చూసుకుని ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు ఓ ఖాకీ. కానీ ఆమె తెలివిగా అతడి ప్రవర్తనను వీడియో తీసి పై అధికారులకు అందించింది. అంతే- సదరు ఖాకీ చేతికి సస్పెన్షన్ ఆర్డర్ అందింది.

అసలేం జరిగిందంటే.. వారణాసికి చెందిన ఓ యువకుడు విశాఖపట్నంలోని ఫోర్ పాయింట్స్ హోటల్‌లో పనిచేస్తున్నాడు. మలేసియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ యువతితో అతడు ప్రేమలో పడ్డాడు.

3 Town CI Rape Attempt on Girl in Visakhapatnam, Suspended

ఈ నేపథ్యంలో ఆ యువతి కూడా మలేసియా నుంచి వచ్చేసి, కొద్ది నెలల క్రితం తన ప్రియుడు పనిచేసే హోటల్‌లోనే చేరింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుకానీ ఆ యువకుడు గత నవంబర్‌లో వైజాగ్ నుంచి పరారయ్యాడు.

దారుణం: యువతిపై రేప్, వీడియోతీసి.. సోషల్ మీడియాలో పెట్టి.. బ్లాక్‌మెయిల్ చేసి..

దీంతో ఆ యువతి నవంబర్ 18న స్థానిక త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పరారైన ఆమె ప్రియుడు పంజాబ్‌లోని లుథియానాలో ఉన్నాడని గుర్తించిన పోలీసులు అక్కడికెళ్లి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం లుథియానా కోర్టులో అతడ్ని హాజరుపరిచి, ఆ తరువాత విశాఖకు తీసుకొచ్చి, జైలుకు తరలించారు. ఇక్కడే ఆ యువతి సీఐ వెంకటరావు సహాయం కోరింది. కాబోయే వాడిని జైలుకు పంపితే, ఆ కోపంతో అతడు తనను పెళ్లిచేసుకోడేమో అనేది ఆమె బాధ.

ఆ యువతి పరిస్థితిని ఆసరాగా తీసుకున్న ఖాకీ కామాంధుడు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ వెంకటరావు ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నించాడు. డిసెంబర్ 28న ఆమె ఉంటున్న హోటల్‌లోనే మరో గదికి తీసుకెళ్లి.. లైంగిక దాడికి యత్నించాడు.

అయితే ఖాకీచకాన్ని ఆ యువతి తెలివిగా వీడియో తీసి మంగళవారం పోలీస్ కమిసనర్‌కు పంపించింది. ప్రాథమిక విచారణలో సీఐ వెంకటరావుపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vishakhapatnam three town CI Venkat Rao suspended for comitting sexual assault on a woman, when she asked him for help in lover arrest case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి