ఏపీలో కొత్తగా 400 దిగువకు కరోనా కేసులు: 5వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా కేసులివే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా 400కు దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 40,855 నమూనాలను పరీక్షించగా.. 396 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 396 కరోనా కేసులు, ఆరుగురు మృతి
కొత్తగా నమోదైన 396 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,63,177కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ఆరుగురు మృతి చెందారు. కృష్ణా ఇద్దరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,336కి పెరిగింది.

ఏపీలో 5222కు తగ్గిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 566 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,43,616కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 5,222 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,92,26,511 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 94 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 05, చిత్తూరులో 94, తూర్పుగోదావరిలో 33, గుంటూరులో 61, కడపలో 11, కృష్ణాలో 56, కర్నూలులో 04, నెల్లూరులో 19, ప్రకాశంలో 20, శ్రీకాకుళంలో 15, విశాఖపట్నంలో 34, విజయనగరంలో 12, పశ్చిమగోదావరిలో 32 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,93,201, చిత్తూరులో 2,46,346 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,907) కరోనా కేసులున్నాయి.

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 13.64 లక్షల నమూనాలను పరీక్షించగా.. 16,326 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,59,562కి పెరిగింది. అంతకుముందు రోజు కంటే 3.42 శాతం కేసులు ఎక్కువ కావడం గమనార్హం. కాగా, తాజాగా, మరణాలు భారీగా పెరిగాయి. శుక్రవారం 666 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఒక్క కేరళ రాష్ట్రంలోనే 563 మరణాలు సంభవించడం గమనార్హం. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,53,708కు చేరింది. శుక్రవారం 17,677 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.35 కోట్లకు పెరిగింది. రికవరీ రేటు 98.16 శాతానికి పెరిగింది. 2020 మార్చి తర్వాత ఇదే గరిష్ట రికవరీ రేటు కావడం గమనార్హం. కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో 233 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి యాక్టివ్ కేసులు. ప్రస్తుతం దేశంలో 1,73,728 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. శుక్రవారం 68.48 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 1.01 కోట్ల డోసుల పంపిణీ జరిగింది.












Click it and Unblock the Notifications