ఏపీలో కొత్తగా 478 కరోనా కేసులు, పెరిగిన రికవరీ: తూర్పూగోదావరిలో అత్యధిక కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా 500కు దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 43,494 నమూనాలను పరీక్షించగా.. 478 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 478 కరోనా కేసులు, ఏడుగురు మృతి

ఏపీలో కొత్తగా 478 కరోనా కేసులు, ఏడుగురు మృతి

కొత్తగా నమోదైన 478 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,62,781కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ఆరుగురు మృతి చెందారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,333కి పెరిగింది.

ఏపీలో 5398కు తగ్గిన యాక్టివ్ కేసులు

ఏపీలో 5398కు తగ్గిన యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 574 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,43,050కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 5,398 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,91,85,656 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 119 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 18, చిత్తూరులో 36, తూర్పుగోదావరిలో 119, గుంటూరులో 60, కడపలో 24, కృష్ణాలో 39, కర్నూలులో 04, నెల్లూరులో 29, ప్రకాశంలో 18, శ్రీకాకుళంలో 11, విశాఖపట్నంలో 20, విజయనగరంలో 05, పశ్చిమగోదావరిలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,93,168, చిత్తూరులో 2,46,252 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,895) కరోనా కేసులున్నాయి.

Recommended Video

    Germany: Pilots Return To Work To Cover Tourism Demand
    దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

    దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

    దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ముందు రోజు 18వేలకు పెరిగిన కరోనా కేసులు తాజాగా, 14 శాతం తగ్గాయి. మరణాలు మాత్రం 200పైనే నమోదయ్యాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 13,24,263 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. 15,786 మంది కరోనా బారినపడినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.41 కోట్లు దాటింది. గురువారం 231 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి మరణించినవారి సంఖ్య 4.53లక్షలకు చేరింది. తాజాగా, 18,641 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి క్షేమంగా బయటపడినవారి సంఖ్య 3.35 లక్షల మందికిపి చేరింది. రికవరీ రేటు 98.16 శాతానికి చేరింది. కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం దేశంలో 1,75,745 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.51 శాతానికి తగ్గింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గురువారం 61,27,277 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 100కోట్లు దాటింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+