నిట్‌కు 480 సీట్లు, 60 ఎక్స్‌ట్రా, అవి తెలంగాణకే
న్యూఢిల్లీ: ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎన్‌ఐటీలో రాష్ట్ర విద్యార్థులకు 300 సీట్లు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. విభజన చట్టం హామీ మేరకు నిట్‌కు తొలుత 120 సీట్లు కేటాయించారు.
అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు పలుసార్లు విజ్ఞప్తులు చేయడంతో 480 సీట్లతో నిట్ ఏర్పాటుకు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అంగీకరించారు.
కేంద్ర మంత్రి స్మృతిఇరానీతో సుజనా, ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, విశాఖ ఎంపీ హరిబాబులు బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్ర విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని నిట్‌లో ప్రవేశాల సంఖ్యను పెంచాలని కోరారు. దానికి స్మృతి సానుకూలంగా స్పందించారు.
మొత్తం 480 సీట్లతోపాటు మరో 60 సూపర్ న్యూమరరీ సీట్లు ఇవ్వడానికి అంగీకరించారు. మొత్తం 480 సీట్లలో స్థానిక కోటా కింద 240, సూపర్ న్యూమరరీ 60 సీట్లతో కలిపి రాష్ట్రానికి 300 సీట్లు వచ్చినట్లు అవుతుంది.

నిట్‌ను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు లేఖను మంత్రి మాణిక్యాల రావు కేంద్రమంత్రి స్మృతికి అందజేశారు. ఆమె సానుకూలంగా స్పందించారు. అనంతరం సుజన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు వరంగల్ నిట్‌లో 740 సీట్లకు గానూ 13 జిల్లాల సీమాంధ్ర విద్యార్థులకు జనాభా ప్రాతిపదికన 200 సీట్లు లభించేవని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా నిట్ నెలకొల్పనుండడంతో 300 సీట్లు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
తొలుత కేవలం 120 సీట్లతో కేంద్రం నిట్‌ను ప్రకటించిందని, అప్పుడు స్థానిక కోటాలో రాష్ట్రానికి 60 సీట్లే దక్కేవని, కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తులు చేయడంతో 480సీట్లతో నిట్ ఏర్పాటుకి అంగీకరించిందని, 60 సీట్లు సూపర్‌న్యూమరరీ రూపంలో పెంచాలని కోరగా కేంద్రం అంగీకరించిందని తెలిపారు.
గతంతో పోలిస్తే ఏపీ విద్యార్థులకు 100 సీట్లు అదనంగా రాగా వరంగల్ నిట్‌లో తెలంగాణ విద్యార్థులకు 200 సీట్లు పెరిగినట్త్లెందన్నారు. రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఇది శుభపరిణామమన్నారు. కాగా, ఏపీలో నిట్ సీట్ల సంఖ్య 540కి పెరగగా, వరంగల్ నిట్‌లో 50 శాతం అంటే 370 సీట్లు తెలంగాణకే.
-
రైతు భరోసా నిధులు జమ, ప్రభుత్వం తాజా నిర్ణయం..!! -
today rashiphalalu: నేడు వీరు నక్కతోక తోక్కినట్టే అదృష్టం వస్తుంది.. మీరున్నారా? -
4 గ్రహాల కలయికతో ఈ రాశులకు అద్భుతమైన ధనయోగం -
ప్రయాణీకులకు APSRTC గుడ్ న్యూస్, ఉచిత బస్సు పథకంలోనూ ఇక..!! -
బంగారం ధరలకు రెక్కలు- నెత్తిన పాలు పోసిన డొనాల్డ్ ట్రంప్ -
Hyderabad: పీల్చే గాల్లో స్లో పాయిజన్.. ఐఐటీ కాన్పూర్ వార్నింగ్ -
నక్కతోక తొక్కొచ్చాడ్రోయ్- చిచ్చరపిడుగు దొరికాడు: రసవత్తరంగా టీ20 వరల్డ్ కప్ -
ఓటీటీలోకి సంక్రాంతి సినిమాలు.. రిలీజ్ డేట్స్ ఇవే..! -
ట్రంప్-మోదీ డీల్ మ్యాజిక్: భారీగా తగ్గనున్న ధరలు! -
అంతర్జాతీయ కోర్టుకు భారత్ బిగ్ షాక్- సింధు జలాలపై తాజాగా ఇదే..! -
హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా - ఇక 3.5 గంటల్లోనే బెంగళూరు, చెన్నై..హాల్టింగ్స్..!! -
Godavari Express: అది రైలు కాదు 52 ఏళ్ల ఎమోషన్- రైల్వే అరుదైన అవార్డు..!












Click it and Unblock the Notifications