అమరావతి ఉద్యమం 600 రోజులు- చంద్రబాబు కీలక వ్యాఖ్యలు-సుప్రీంతీర్పుతో
ఏపీలో అమరావతి రాజధానిని కాపాడుకునేందుకు సాగుతున్న ఉద్యమం 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భఁగా టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమం చారిత్రాత్మకం అని ఆయన అన్నారు. జగన్ చేస్తున్న దాడి అమరావతిపై కాదని, యావత్ రాష్ట్ర సంపద సృష్టిపైనే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాజధాని కోసం పోరాటం చేస్తున్న దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఉద్యమానని అణచాలని చూసినా మొక్కవోని దీక్షతో రైతులు చేసిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కన్నతల్లి లాంటి 32 వేల ఎకరాల భూమిని రైతులు, రైతు కూలీలు త్యాగం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. వారు ఇచ్చిన భూమిలోనే హైకోర్టు, సచివాలయం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగులకు ఇళ్లు కట్టించామన్నారు.

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, నేల పటుత్వం లేదని, ముంపు ప్రాంతమని, అన్ని వర్గాల ప్రజలుంటే కేవలం ఒకే సామాజిక వర్గమే ఉందంటూ వైసీపీ ప్రభుత్వం అసత్య ప్రచారం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా వైసీపీ తప్పుడు ప్రచారాలు ఆగలేదన్నారు. రాజధానిలో రోడ్లు వేసిన కంకరను దొంగతనంగా తవ్వుకుని, హైకోర్టు సమీపంలో ఇసుకను మాయం చేసే స్ధితికి వైసీపీ నేతలు వచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని సైతం చెడగొట్టారన్నారు.












Click it and Unblock the Notifications