ఎమ్మెల్సీలు ఏకగ్రీవం: నారా లోకేష్ సహా 5గురు టిడిపి, ఇద్దరు జగన్ పార్టీ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల కోటాలోని 7 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసేసరికి మొత్తం 7 దరఖాస్తులే రావడంతో ఇక ఎన్నిక నిర్వహణ లేనట్లయ్యింది. అయితే, బుధవారం నామినేషన్ల పరిశీల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల కోటాలోని 7 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసేసరికి మొత్తం 7 దరఖాస్తులే రావడంతో ఇక ఎన్నిక నిర్వహణ లేనట్లయ్యింది. అయితే, బుధవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు.
తెలుగుదేశం నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేష్, కరణం బలరాం, పోతుల సునీత, డొక్కా మాణిక్యవరప్రసాద్, బత్తుల అర్జునుడు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈళ్ల నాని, గంగుల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మార్చి 9వ తేదీ ఉపసంహరణ గడువు ముగిశాక వీరిని ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు.

కాగా, ఈ నామినేషన్ల దాఖలులో చివరినిమిషంలో హైడ్రామా నడిచింది. సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డమ్మీ అభ్యర్ధిగా గంగుల సతీమణి ఇందిరారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. దీనికి పోటీగా మంగళవారం తెలుగుదేశం కూడా మరో డమ్మీ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధపడింది.
చివరి నిమిషంలో ఇందిరారెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో తెలుగుదేశం కూడా డమ్మీ ఆలోచనలను విరమించుకుంది. దీంతో స్వీకరణ గడువు ముగిసేసరికి మొత్తంగా 7 నామినేషన్లే దాఖలయ్యాయి.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications