వేల కోట్లు ముంచాడు: పార్టీకి సన్నిలియోన్, అనుచరుల్లో విశాఖవాసి

వేలాది కోట్ల రూపాయలు ముంచిన అభినవ్ మిట్టల్ దర్జా ఇంతా అంతా కాదు, ఆయన బర్త్ డే పార్టీకి సన్నీ లియోన్ కూడా హాజరైంది. అతని అనుచరుల్లో విశాఖవాసి ఉన్నాడు.

హైదరాబాద్ : సోషల్ ట్రేడ్ డాట్ బిజ్ అనే సైట్ ద్వారా ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసి ఏడు లక్షల మందిని 3,700 కోట్ల మేర ముంచిన ముఠాను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. దాని సూత్రధారి అభినవ్ మిట్టల్‌తో పాటు మరో ఇద్దరు శ్రీధర్ ప్రసాద్, మహేష్ దయాళ్‌లను అరెస్టు చేసింది. వీరిలో శ్రీధర్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందినవాడు.

ఘజియాబాద్‌కు చెందిన మిట్టల్ బిటెక్ పూర్తి చేశాడు. దయాళ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాష్ట్రకు చెందినవాడు.అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద కంపెనీని రిజిష్టర్ చేశారు. మిట్టల్ దీనికి యజమాని. దాన్ని 2015లో స్థాపించి నాలుగు రకాల ప్యాకేజీలను ఇచ్చారు. అయితే, భారీగా మోసాలకు పాల్పడినట్లు తేలింది. అయితే, దాని యజమాని మిట్టల్ వెలగబెట్టిన దర్జా ఇంతా అంతా కాదు.

7 lakh people duped of Rs 3,700 crore by Noida-based firm in 'social trade', 3 arrested

అనుభవ్‌ మిట్టల్‌ ఫేస్‌బుక్‌ పేజీ చూస్తే అతనో ఐకాన్‌గా కనిపిస్తాడు. పేజీ నిండా ఆదర్శాలను వల్లించే వీడియోలను పోస్టు చేశాడు. అది పెద్ద యెత్తున లైకులతో నిండిపోయింది. అతనికి ఖరీదైన కార్లు, విందులు ఇష్టం. నిరుడు నవంబర్‌ 29న అనుభవ్‌ మిట్టల్‌ పుట్టిన రోజు వేడుకకు బాలీవుడ్‌ నుంచి అమీషాపటేల్‌, సన్నీలియోనిలు హాజరయ్యారు. ఆ ఫొటోలు ఇప్పుడు లీకై సంచలనం సృష్టిస్తున్నాయి.

తన సంస్థల్లో డబ్బులు చెల్లించిన వారు వ్యాపారం చేసుకోవడానికి వీలు కల్పిస్తూ దాన్ని రూపొందించి వేల కోట్లను దిగమింగాడు. ఆస్తులు కూడా భారీగానే పెంచుకున్నాడు. గ్రేటర్ నోయిడా, నోయిడాల్లో అతనికి భారీగా ఆస్తులున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+