Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

74 ఏళ్ల వృద్ధాప్యంలో గర్బం :పెళ్లైన 57 ఏళ్లకు కడుపు పంట: కవలలకు జన్మనివ్వనున్న అవ్వ..!!

ఇది ఒక అధ్బుతం. ప్రపంచ రికార్డు. అవ్వగా పిలిపించుకోవాల్సిన వయసులో తల్లి కాబోతోంది. తన 57 ఏళ్ల నిరీక్షణకు ఫలితం రాబోతోంది. 74 ఏళ్ల వయసులో కవలలకు సిజేరియన్ ద్వారా జన్మ ఇవ్వనుంది. ఇందు కోసం ఈ రోజు మూహూర్తంగా నిర్ణయించారు. గుంటూరు కేంద్రంగా జరుగుతున్న ఈ అద్బుతం ప్రపంచ రికార్డుగా నమోదు కానుంది. గతంలో 72 ఏళ్ల వయసులో ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ బిడ్డకు జన్మ ఇచ్చారు. అప్పట్లోనే అది ప్రపంచ రికార్డు అన్నారు. ఈ లెక్కన 74 ఏళ్ల వయసులో మంగాయమ్మ బిడ్డను కంటే ఆ రికార్డు చెరిగిపోయి ఇదే ప్రపంచ రికార్డు గా నమోదు కానుంది.

74 ఏళ్ల వయసులో గర్బం..పెళ్లైన 57 ఏళ్లకు కడుపు పంట
ఎలాగైనా అమ్మ అని పిలిపించుకోవాలనే ఆ పిలుపు కోసం అయిదు దశాబ్దాలకు పైగా నిరీక్షించింది. ఆమె కల ఇన్నాళ్లకు పెళ్లయిన 57 ఏళ్లకు.. 74 సంవత్సరాల వయసులో నెరవేరనుంది. తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962 మార్చి 22న వివాహమైంది. పెళ్లయి ఎన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఏళ్లు గడిచినా వారి ఆశలు నెరవేరలేదు. చివరికి వారి కోరిక, ఆశలు నెరవేరకుండానే.. ఇద్దరూ వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారు. అయినప్పటికీ మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలనే కోరిక మాత్రం తగ్గలేదు.

74 years lady giving birth for twins in Guntur. After 57 years of marriage lady got pregnancy by IVF system

దీంతో..గత నవంబర్ లో గుంటూరులోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఐవీఎఫ్‌ పద్దితిలో కృత్రిమ సంతాన సాఫల్య విధానం ద్వారా గర్బం దాల్చారు. కలిశారు. మంగాయమ్మకు బీపీ, షుగర్‌ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. మంగాయమ్మ మెనోపాజ్‌ దశ దాటిపోవడంతో వేరే మహిళ నుంచి అండాన్ని.. మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) పద్ధతిలో ప్రయత్నం చేశారు. మొదటి సైకిల్‌లోనే వైద్యుల కృషి ఫలించింది. ఈ ఏడాది జనవరిలో మంగాయమ్మ గర్భం ధరించినట్లు తేలింది.

నేడు సిజేరియ్ ద్వారా డెలివరీ..
వయసు రీత్యా ఆమెకు సాధారణ ప్రసవం కష్టం కాబట్టి.. సిజేరియన్‌ ద్వారా కాన్పు చేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. నెలలు నిండటంతో సెప్టెంబర్‌ 5న ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఆపరేషన్‌ చేస్తామన్నారు. కాగా.. స్కానింగ్‌లో మంగాయమ్మ గర్భంలో కవలలు ఉన్నట్లు తెలిసిందని డాక్టర్లు చెబుతున్నారు. గురువారం చేసే శస్త్రచికిత్స కోసం ఇద్దరు గైనకాలజిస్టులు, ఇద్దరు శిశు వైద్యనిపుణులు, ఇద్దరు మత్తు మందు డాక్టర్లను, కార్డియాలజి స్ట్‌ను సిద్ధంగా ఉన్నారు.. సుదీర్ఘకాలం తర్వాత తన స్వప్నం నెరవేరి, తల్లి కాబోతున్న ఆ శుభ ఘడియల కోసం మంగాయమ్మ ఆనందంగా ఎదురు చూస్తున్నారు. గతంలో 72 సంవత్సరాలకు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళ మగ బిడ్డకు జన్మ ఇచ్చారు. ఇప్పుడు 74 ఏళ్ల వయసులో మంగాయమ్మ బిడ్డను కంటే ఆ రికార్డు చెరిగిపోయి ఇదే ప్రపంచ రికార్డు కానుంది. దీని పైన ఇప్పుడు వైద్య నిపుణులుతో పాటుగా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+