రైలులో అగ్నిప్రమాదం: మంటల్లో చిక్కుకున్న 3 బోగీలు!(వీడియో)

బీహార్లోని సహర్సా జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. ఓ ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి మూడు కోచ్‌లకు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ మంటల చెలరేగకముందే ప్రయాణీకులందరూ రైలు నుంచి సురక్షితంగా బయటకు రాగలిగారు. కానీ రైలు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సహర్సా జిల్లాలోని సిమ్రి బఖ్తియార్‌పూర్ రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ప్లాట్‌ఫామ్ నంబర్ 2పై ప్రయాణికుల రైలుకు మంటలు అంటుకోవడంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి తలెత్తింది.

60 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. బ్రిటిష్ కాలం నాటి లెజెండ్రీ బీర్ వచ్చేస్తుంది
60 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. బ్రిటిష్ కాలం నాటి లెజెండ్రీ బీర్ వచ్చేస్తుంది

ఇదంతా తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగింది. సహర్సా నుంచి సమస్తిపూర్‌కు వెళ్తున్న 63344 నంబరు గల ప్యాసింజర్ రైలు ప్లాట్‌ఫారమ్‌పై ఉంది. రైలు మధ్యలో ఉన్న ఇంజన్ నుంచి పొగ, ఆ తర్వాత మంటలు రావడం ప్రారంభమయ్యాయి. అనంతరం ఆ మంటలు వ్యాపించడం మొదలైంది.మంటలను చూసి ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇంజన్ నుంచి దట్టమైన పొగ వెలువడటం ప్రారంభమైందని, ఆ తర్వాత భయంకరమైన మంటలు బీభత్సం సృష్టించడం మొదలుపెట్టాయని సమాచారం. క్రమంగా ఆ మంటలు ఇంజన్‌ నుంచి మూడు బోగీలకు వ్యాపించాయి. మంటలను చూసి రైలు లోపల, బయట ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. మంటలు ఎంత ఎత్తుకు ఎగసిపడ్డాయంటే.. అవి స్టేషన్ ప్రాంగణంలో భయాందోళనలను సృష్టించాయి.

Bihar Train Fire Major Accident Averted at Saharsa Station as Passengers Escape Details

రైలులో చాలా మంది ప్రయాణీకులు
మంటల తీవ్రతను చూడగానే ప్రయాణికులు రైలు దిగడం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రయాణికులందరూ ప్లాట్‌ఫారమ్‌ను విడిచి వెళ్లడం మొదలుపెట్టారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు రైలులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. అదృష్టవశాత్తూ మంటలను పసిగట్టిన వెంటనే ప్రయాణికులందరూ రైలు దిగిపోయారు.

 ఇక సిద్దం అయిపోండి, ఆగస్టు 5 - కేంద్రం సంచలన నిర్ణయం..!?
ఇక సిద్దం అయిపోండి, ఆగస్టు 5 - కేంద్రం సంచలన నిర్ణయం..!?

చర్యలు చేపట్టిన అగ్నిమాపక దళం
అగ్నిప్రమాదం గురించి వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. అగ్నిమాపక బృందం వాహనాలతో అక్కడికి చేరుకుంది. ఇంతలో రైల్వే అధికారులు కూడా వచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మూడు కోచ్‌లలోనూ మంటలను ఆర్పివేయడం ప్రారంభించారు. అయితే మంటలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. వాటిని అదుపు చేయడానికి అగ్నిమాపక బృందం కూడా చాలా కష్టపడింది.

దర్యాప్తు ప్రారంభం
రైలులో జరిగిన అగ్నిప్రమాదం సిమ్రి బఖ్తియార్‌పూర్‌కు రాకపోకలు సాగించే రైళ్లపై ప్రభావం చూపింది. కొన్ని రైళ్లను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని రైల్వే అధికారులు ఇంకా వెల్లడించలేదు. దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అగ్నిప్రమాదం ఎలా జరిగిందో తెలియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+