శ్రీశైలంలో ప్రోటోకాల్, స్పర్శ దర్శన విధానంలో మార్పులు - తాజా మార్గదర్శకాలు..!!

శ్రీశైలం ఆలయంలో కీలక మార్పులు చేస్తున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ప్రోటోకాల్ దర్శన విధానాల్లో మార్పులు చేసారు. ఇందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు ఖరారు చేసారు. అదే విధంగా స్పర్శ దర్శనంలోనూ కొత్త నిర్ణయాల అమలుకు సిద్దం అయ్యారు. ఇక.. పాలనా పరంగానూ ఉద్యోగుల బదిలీలు.. పాలనా వ్యవహారాల్లోనూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

శ్రీశైలం లో కొత్త నిర్ణయాల అమలుకు రంగం సిద్దమైంది. శ్రీశైలం ఆలయంలో ప్రోటోకాల్ దర్శన విధానాల్లో మార్పులు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం ప్రోటోకాల్ దర్శనాల్లో మార్పులు చేసినట్లు ఈవో తెలిపారు. శని, ఆది, సోమవారాల్లో ఉదయం, మధ్యాహ్నం స్పర్శ దర్శనం ఉండదన్నారు. శని, ఆది, సోమవారాల్లో రాత్రివేళ స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందన్నారు. మిగిలిన రోజుల్లో యథావిధిగా 3 పూటలు స్పర్శ దర్శనాలు కొనసాగుతాయన్నారు. శ్రావణమాసంలో శుక్రవారం రాత్రిపూట స్పర్శ దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు. సిఫార్సు లేఖలను [email protected] కి పంపించాలని సూచించారు. సిఫార్స్ లేఖల అధికారిక లెటర్ హెడ్‌లను 2 రోజుల ముందుగా దేవస్థానానికి పంపాలని సూచన చేసారు.

అరుణాచలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ - కొత్త నిబంధనలు, టైమింగ్స్..!!
అరుణాచలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ - కొత్త నిబంధనలు, టైమింగ్స్..!!
srisailam-temple-officials-made-key-changes-in-protocol-darshan-and-key-guide-lines-for-employees

అధికారుల తాజా నిర్ణయాలు

అదే విధంగా ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అయిదు రోజుల పాటు వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ఆగమశాస్త్రానుసారంగా జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలదేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతిలో ఆగష్టు 7 శుక్రవారం రోజున సరస్వతీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీశైలదత్తత దేవాలయమైన జ్యోతిస్సిద్ధవట ఆలయ జీర్ణోద్ధారణ చేయాలని తీర్మానించారు. దశల వారిగా ఈ ఆలయంలో ఆయా అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ఇందుకు అవసరమైన అంచనాలను రూపొందిస్తున్నారు. క్యూకాంప్లెక్సు నిర్మాణం, తిరుమల తరహాలో ఫిలిగ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్సు నిర్మాణం, సాలుమండపాల నిర్మాణం మొదలైనవన్నీ ప్రాధాన్యతా క్రమములో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+