ఏపీకి " అప్పు" డే తెల్లారిందా?: నెలైనా కాలేదు: రూ.7,000 కోట్లకు టెండర్
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. అధికారంలోకి రావడానికి భారీగా హామీలను ఇచ్చిన నేపథ్యంలో వాటిని అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడగట్టుకునే ప్రయత్నాల్లో పడింది.
ఇందులో భాగంగా- ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. వాటి విలువ 5,000 కోట్ల రూపాయలు. జులై 2వ తేదీన ఈ సెక్యూరిటీ బాండ్లు వేలానికి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఇ-కుబేర్) ద్వారా వేలం పాట సాగుతుంది. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తుంది రిజర్వ్ బ్యాంక్.

1,000 కోట్ల రూపాయల విలువ చేసే అయిదు సెక్యూరిటీ బాండ్లను వేలం పాటకు పెట్టింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ధృవీకరించింది. ఈ బాండ్ల కాల వ్యవధి ఒకటి- 9 సంవత్సరాలు. మిగిలిన వాటిల్లో రెండవది- 12, మూడవది- 17, నాలుగవది- 21, అయిదవది- 24 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు.
కాంపిటీటివ్ విధానంలో బాండ్లను కొనదలిచిన వారు ఈ నెల 25వ తేదీన ఉదయం 10:30 నుంచి 11:30 గంటలు, కాంపిటీటివ్ విధానంలో బాండ్లను కొనదలిచిన వారు ఈ నెల 25వ తేదీన ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తమ బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఈ వారం రోజుల వ్యవధిలో ఏపీ ప్రభుత్వం తన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టడం ఇది రెండోసారి ఇదివరకే 1,000 కోట్ల రూపాయల చొప్పున రెండు బాండ్లను వేలం పాట ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీన ఆక్షన్ పూర్తయింది. ఇప్పుడు మరో 5,000 కోట్ల రూపాయల సమీకరణకు పూనుకుంది.

ఏపీతో పాటు మరో ఎనిమిది రాష్ట్రాలు తమ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టాయి. ఇందులో.. జమ్మూ కాశ్మీర్- రూ. 500 కోట్లు, కేరళ- రూ.1,500 కోట్లు, మణిపూర్- రూ.200 కోట్లు, మేఘాలయా- రూ.400 కోట్లు, పంజాబ్- రూ.2,500 కోట్లు, తమిళనాడు- రూ. 2,000 మేర విలువ చేసే సెక్యూరిటీ బాండ్లు ఉన్నాయి.
తెలంగాణ సైతం ఆదాయ వనరులను సమీకరించుకోవడానికి సెక్యూరిటీ బాండ్ల వేలంపైనే ఆధారపడింది. 2,000 కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లను వేలానికి పెట్టింది. మొత్తంగా ఆయా ప్రభుత్వాల నుంచి 14,100 కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వేలం వేయనుంది. అవన్నీ కూడా జులై 2వ తేదీన వేలానికి రానున్నాయి.












Click it and Unblock the Notifications