ఆంధ్రప్రదేశ్ లో 9,265 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ...స్కూళ్ల మూసివేతపై వివరణ అడిగిన సుప్రీంకోర్టు!
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 9, 265 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో అశోక్‌గుప్తా త్రిసభ్య కమిటీ లెక్కలు తేల్చింది. ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు అఫిడవిట్ దాఖలు చేసింది.
ఒకసారి 4600 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్న ఎపి ప్రభుత్వం మరోసారి పోస్టుల కంటే ఉపాధ్యాయులే ఎక్కువ ఉన్నారని కోర్టుకి తెలపడంతో కోర్టు పోస్టుల లెక్క తేల్చేందుకు కమిటీని నియమించింది. అశోక్‌గుప్తా నేతృత్వంలోని ఈ త్రిసభ్య కమిటీ విచారణ జరిపి రాష్ట్రంలో మొత్తం 9, 265 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చింది.

అంతేకాకుండా ఎపిలో గత సంవత్సరం 1167 స్కూళ్లు మూసేసారని కూడా త్రిసభ్య కమిటీ కోర్టుకు తెలపింది. దీంతో సూళ్ల మూసివేత అంశాన్ని సీరియస్ గా పరిగణించిన సుప్రీంకోర్టు ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వచ్చే విద్యాసంవత్సరంలోగా భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications