ఏపీలో కరోనా కల్లోలం: రెండోరోజూ వెయ్యికి చేరువలో కొత్త కేసులు, ఆ 3 జిల్లాల్లో సెంచరీ దాటిన కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒక్క రోజు వ్యవధిలో సుమారు వెయ్యి పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 42,696 నమూనాలను పరీక్షించగా.. 947 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా నమోదైన 9074 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,97,810కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ఎవరూ మరణించలేదు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7,203గా ఉంది.

 947 new corona cases reported in andhra pradesh: Two deaths in last 24 hours

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 377 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,85,892కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,715 యాక్టివ్ కేసులున్నాయి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,49,58,897 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 35, చిత్తూరులో 180, తూర్పుగోదావరిలో 58, గుంటూరులో 145, కడపలో 40, కృష్ణాలో 113, కర్నూలులో 61, నెల్లూరులో 43, ప్రకాశంలో 23, శ్రీకాకుళంలో 56, విశాఖపట్నంలో 156, విజయనగరంలో 19, పశ్చిమగోదావరిలో 18 కరోనా కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+