ప్రైవేటు వోల్వో బస్సు దగ్ధం: అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు

కృష్ణా: విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం చెక్‌పోస్టు వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు వోల్వో బస్సులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. బస్సు వెనక భాగం నుంచి మంటలు వెలువడుతుండటంతో గమనించిన స్థానికులు బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో బస్సులోని డ్రైవర్, క్లీనర్ బస్సు ఆపి, బయటికి పరుగులు తీశారు.

A bus has been burned in Tummalapalem

అయితే బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉన్న ఒక్కరిద్దరు ప్రయాణికులు అద్దాలను పగలగొట్టుకుని బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశాయి.

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కడప: జిల్లాలోని ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటి భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. గాయపడిన విద్యార్థినిని రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+