కాలేజీ హాస్టల్లో డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య
నెల్లూరు: జిల్లాలోని గూడూరు డీఆర్‌డబ్ల్యూ కళాశాలకు చెందిన బీఎస్సీ మొదటి సంవత్సరం విద్యార్థిని రవళి(17) ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల వసతి గృహం గదిలో ఫ్యానుకు ఉరేసుకొని రవళి ఆత్మహత్యకు పాల్పడినట్లు గురువారం ఉదయం గుర్తించారు.
మృతి చెందిన విద్యార్థిని రాపూరు మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన రవళిగా స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
హాస్టళ్లో గత కొన్ని రోజులుగా బంగారు నగలు పోయాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నగల విషయంలో విద్యార్థులను వేధించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రవళి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కళాశాల యాజమాన్యం రవళి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం విచారకరం.
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

కృష్ణా: కంచికచెర్ల డివిజన్ పరిధిలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు యువకులు మృతి చెందారు. పరిటాల సమీపంలో జాతీయ రహదారిపె జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు.
మండలంలోని పేరకిలపాడుకు చెందిన బురదగుంట మధు(30), దోమ కోటేశ్వరరావు ఎలియాస్ తంబి (25), బండి నాగరాజు (22) కేతనకొండలో వివాహ వేడుకకు హాజరై బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా పరిటాల సమీపంలో విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిలో రాంగ్ రూట్‌లో వచ్చిన స్టోన్ క్రషర్‌కు చెందిన టిప్పర్ ఢీకొట్టింది.
దీంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని నందిగామ డిఎస్‌పి రాధేష్ మురళి, నందిగామ రూరల్ సిఐ సత్యకిషోర్, కంచికచర్ల ఎస్‌ఐ కె ఈశ్వర్‌లు సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications