జేఎన్టీయూలో కీచకుడు: విద్యార్థినికి లైంగిక వేధింపులు, యాసిడ్ పోస్తానని బెదిరింపు

అనంతపురం: జిల్లాలోని జేఎన్‌టీయూ అధ్యాపకుడు ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. కదిరి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని గతంలో జెఎన్టీయూ‌లో ఎంబీయే పూర్తిచేసింది. అప్పట్లో గెస్ట్ ఫ్యాకల్టీ అయిన సుశీల్‌ కుమార్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు గురిచేశాడు.

కాగా, ఎంబీయేలో ఓ సబ్జెక్ట్‌కు సంబంధించి పరీక్షకు హాజరయ్యేందుకు తాజాగా ఆమె జేఎన్టీయూకు వెళ్లింది. ఆ సమయంలోనూ ఆమె పట్ల సుశీల్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడు.

అంతేకాకుండా చెప్పినట్టు వినకుంటే యాసిడ్ పోస్తానంటూ విద్యార్థిని బెదిరించాడు. దీంతో వేధింపులు భరించలేని బాధితురాలు మంగళవారం రాత్రి కదిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సుశీల్ కుమార్ కోసం గాలిస్తున్నారు.

A girl molested by lecturer

అనంతపురం జెఎన్‌టియూలో జరిగిన సంఘటనపై వీసీ సర్కార్, రిజిస్ట్రార్ కృష్ణయ్య స్పందించారు. ఎంబిఎ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోణలు ఎదుర్కుంటున్న సుశీల్ కుమార్ తమ యూనివర్శిటీ ప్రొఫెసర్ కాడని చెప్పారు.

2013లో ఒక రోజు మాత్రమే విద్యార్థులకు కాల్స్ తీసుకున్నాడని చెప్పారు ఆ తర్వాత ఎంబిఎ విద్యార్థినికి, సుశీల్ కుమార్‌కు మధ్య ఏం జరిగిందో తమకు తెలియదని వారు చెప్పారు ఈ వ్యవహారంతో యూనివర్శిటీకి సంబంధం లేదని చెప్పారు.

విద్యుత్‌ తీగలు తగిలి అన్నదమ్ములు మృతి

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సంకేపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బోయ నర్సింహులు(38), తిరుపాల్‌(35) ఇద్దరూ అన్నదమ్ములు. వీరు తమ పొలంలో వేరుశనగ పంటను సాగుచేయగా.. అడవి పందుల బెడద ఉండటంతో పొలం చుట్టూ పంట రక్షణ కోసం విద్యుత్‌ తీగలతో కంచె ఏర్పాటు చేశారు.

మంగళవారం రాత్రి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లగా... ప్రమాదవశాత్తూ నర్సింహులుకు విద్యుత్‌ తీగలు తగిలాయి. అతన్ని రక్షించేందుకు సోదరుడు తిరుపాల్‌ ప్రయత్నించగా అతను కూడా ప్రమాదానికి గురై మృతిచెందాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+