చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ సరిహద్దుల్లో భారీ నగదు పట్టివేత ... ఎంతో తెలుసా 

|
Google Oneindia TeluguNews

ఎన్నికల కాలం వచ్చేసింది. ఈసారి ఎన్నికల్లో డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు అన్న అంచనాలను సైతం వేశారు ఎన్నికల అధికారులు. రానున్న సార్వత్రిక ఎన్నికలు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు కావడంతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరుగుతుందని ముందే గుర్తించారు .

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుంటే తెలుగురాష్ట్రాల్లో సైతం రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు , అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపధ్యంలో నగదు భారీగా ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తుంది.

A huge amount seized in AP border .. do you how much ?

అందులో భాగంగా అప్రమత్తమైన అధికారులు హైదరాబాద్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును సీజ్ చేశారు. రూ.1.53కోట్ల డబ్బును ట్రక్కులో తరలిస్తుండగా పట్టుకున్నట్లు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు తెలిపారు.

తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు చెందిన ఆ విభాగం అధికారులు గుమ్మిడిపూడి చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో ఆంధ్రా నుంచి వచ్చిన ఓ ప్రైవేట్‌ బస్సులో రెండు సూట్‌ కేసుల్లో ఉన్న నోట్ల కట్టలు బయట పడ్డాయి. వాటిని లెక్కించగా రూ.1.53 కోట్లని తేలింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన నీరజ్‌ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తం ఎవరైనా రాజకీయ ప్రముఖుల కోసం ఇక్కడికి తరలిస్తున్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

English summary
In the backdrop of the forthcoming election, a huge amount of cash flows from Hyderabad to Chennai. According to the officials of the Department of Drug Control, Rs.1.53 crore found in a bus and the amount was seized . .Officials from the districts of Thiruvallur and Kanchipuram have taken up vehicle checks at Gummidipudi checkpost. In the inspections two suite cases they found in a private bus coming from Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X