మామిడితోటలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం...చిత్తూరు జిల్లాలో కలకలం
చిత్తూరు జిల్లాలో భారీగా పేలుడు పదార్థాల డంప్ బైటపడిన ఘటన సంచలనం సృష్టించింది. ముందుగా ఓ వ్యక్తి జిలెటిన్ స్టిక్స్ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ జిలెటిన్ స్టిక్స్ ను అతడు క్వారీ పేలుడు కోసం తీసుకెళుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
దీంతో పోలీసులు మరింత లోతుగా అతన్ని ప్రశ్నించడంతో ఏకంగా పేలుడు పదార్థాల డంప్ ఆచూకీనే బైటపడింది. నిందితుడు చెప్పిన సమాచారం ప్రకారం గంగాధరనెల్లూరు మండలం నందనూరుకు వెళ్లిన పోలీసులు అక్కడ ఓ మామిడి తోటలో భారీగా పేలుడు పదార్థాలను గుర్తించి నివ్వెరపోయారు. జిలెటిన్ స్టిక్స్, డిటొనేటర్లు, గన్‌పౌడర్ ను ఆ మామిడి తోటలోని డంప్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మామిడి తోటను సొసైటీ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డికి చెందినది గా గుర్తించారు. ఈ పేలుడు పదార్థాల డంప్ ను అతడికి తెలిసే అక్కడ ఉంచారా లేక తెలియకుండానా అనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.













Click it and Unblock the Notifications