ప్రేమ పెళ్లి చేసుకుందని చెల్లెలి గొంతుకోశాడు: విషమం

ప్రకాశం/కరీంనగర్: ఒంగోలులోని పులివెంకటరెడ్డి కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో ఓ కిరాతక సోదరుడు తన సొంత చెల్లెలి గొంతుకోశాడు. తీవ్రంగా గాయపడిన రాణి కొత్తపట్నం రోడ్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రాణి అనే ఆ యువతి ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.

దంపతుల ఆత్మహత్యాయత్నం: భర్త మృతి

A man allegedly stubbed his sister

కరీంనగర్: జిల్లాలోని సిరిసిల్ల మండలం కర్ణెకట్కూరు గ్రామానికి చెందిన బొమ్మవరం లక్ష్మణరావు(70), అతని భార్య శశిరేఖ(65) బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన ఇరుగుపొరుగువారు వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే లక్ష్మణరావు మృతి చెందాడు.శశిరేఖ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు.

మరో ఘటనలో అప్పులో బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని వర్గల్ మండలం హౌసులోనిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వర్షాభావ పరిస్థితులతో వేసిన పంటలు దెబ్బతిని, చేసిన అప్పులు తీర్చలేక ఆందోళనతోచేసుకున్నాడు రైతు మోతె ఆంజనేయులు(44). ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+