ఏపీలోని దర్శి ప్రాంతానికి కొత్తగా రైల్వేస్టేషన్..
ఏపీలోని దర్శి ప్రాంత వాసుల ఎన్నో యేళ కల నేటికి తీరింది. ఇకనుంచి వారు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైలు బండి ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు. ప్రకాశం జిల్లా పట్టణ సమీపంలోని కొత్తపాలెం దగ్గర నూతనంగా రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు. ఇక, ఈ కొత్త రైల్వేస్టేషన్‌కు మంగళవారం నాడు గూడ్స్ ట్రైన్ చేరుకుంది. వచ్చే నెల నుంచి ఈ ప్రాంతానికి ప్యాసింజర్ రైలు ప్రయాణించనున్నట్లు రైల్వే శాఖా అధికారులు పేర్కొన్నారు.
నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం నడికుడి నుంచి దర్శి వరకు లైన్ నిర్మాణం పూర్తయింది. ఇక, మంగళవారం ఈ కొత్త రైల్వేస్టేషన్‌కు గూడ్స్ ట్రైన్ చేరుకుంది. ఈ సందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్లు ఈ గూడ్స్ బండికి కొబ్బరికాయ కొట్టి ట్రైన్‌ను ప్రారంభించారు.ఈ రైలు బండిని చూసేందుకు అధిక సంఖ్యలో ఆ ప్రాంత వాసులు తరలి వచ్చారు.దర్శి ప్రాంతానికి ట్రైన్ రావడంతో స్థానిక వాసులంతా సంతోషం వ్యక్తం చేశారు.

దర్శి ప్రాంతానికి చెందిన కొందరు గూడ్స్ ట్రైన్‌కు ఘన స్వాగతం పలికారు. దర్శి ప్రాంతంలో రైలు మార్గం నిర్మించడం చాలా సంతోషంగా ఉందని ఆ ప్రాంత వాసులు తెలిపారు. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆ పనుల్లో భాగంగా మొదట నడికుడి నుంచి పల్నాడు జిల్లా శావల్యాపురం వరకు నిర్మాణ పనులు పూర్తి చేసి అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. రెండో దశలో దర్శి స్టేషన్ వరకు పనులు పూర్తి చేసి రైళ్ల రాకపోకలు సాగించే దిశగా పనులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ స్టేషన్ పట్టాల ఏర్పాటు పనులు ఎంతో వేగంగా సాగుతున్నాయి.
దర్శి ప్రాంతంలోని అద్దంకి వద్ద : ఇక, ఈ కొత్త రైల్వేస్టేషన్ దర్శి సమీపంలోని అద్దంకి రోడ్డు దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమీపంలోనే ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణ పనులు కూడా జరగుతున్నాయి. వీటితో పాటు ప్రయాణికులు వేచి ఉండే గదుల నిర్మాణాన్ని కూడా చేపడుతున్నారు. ఇక్కడికి సమీపంలోని పులిపాడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన వంతెనలకు ఇరువైపులా రివిట్‌మెంట్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది.












Click it and Unblock the Notifications