ర్యాగింగ్: ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం(ఫొటో)
హైదరాబాద్: కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కళాశాలల్లో ర్యాగింగ్ విష సంస్కృతి పూర్తిగా నిర్మూలించబడటం లేదు. తాజాగా ర్యాగింగ్‌తో మరో విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. దుండిగల్‌లోని ఓ ఫార్మసీ కళాశాలలో ర్యాగింగ్ కారణంగా శ్రావణ్ కుమార్ (21) అనే విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఆంధ్రానగర్‌కు చెందిన శ్రావణ్ కుమార్ బి ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
ఫిబ్రవరి 7న కళాశాల తరగతులు ముగిసిన తర్వాత అమీర్‌పేట్‌లో తన గదికి వెళ్తుండగా అదే కళాశాలకు చెందిన మూడో సంవత్సరం సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు శ్రావణ్‌ను నగ్నంగా మార్చి కాళ్లతోతన్నారు. ఈ అవమానాన్ని భరించలేని శ్రావణ్ తన వద్ద ఉన్న మెడికల్ కిట్‌లోని హైబిపి మాత్రలను మింగేశాడు. అంతకుముందు తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తన స్నేహితులకు ఫోన్‌లో చెప్పాడు.

వెంటనే అతని దగ్గరికి చేరుకున్న స్నేహితులు, అపస్మారక స్థితిలో ఉన్న శ్రావణ్‌ను సూరారంలోని నారాయణ హృదయాలయా ఆస్పత్రిలో చేర్పించారు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న శ్రావణ్ సోదరుడు నాగబాబు, ఫిబ్రవరి 8న దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుండిగల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా కళాశాలల్లో ర్యాగింగ్ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని, అలాంటి వారిపై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ర్యాగింగ్ విషయంలో కళాశాలలకు పలు సూచనలు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌కు యాజమాన్యాలే కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పర్యవేక్షణ లోపం కారణంగా ర్యాగింగ్ జరుగుతోందని, విద్యార్థులు దైర్యంగా ఫిర్యాదు చేసినప్పుడే ఈ ర్యాగింగ్‌ను అరికట్టగలమని తెలిపాయి.












Click it and Unblock the Notifications