జగన్‌కు ఇలా తగులుకున్నాడేంటీ: సీఎం బావిలో కప్ప: షేమ్ ఆన్ యూ అంటూ ఫైర్

ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఆయనను బావిలో కప్పగా సంబోధించారు.

అమరావతి: తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్తాను చాటి చెప్పిన మరో మూవీ ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా అందుకున్న బాక్సాఫీస్ కలెక్షన్లు 1,000 కోట్ల రూపాయల మార్క్‌ను దాటేశాయి. ఈ ఏడాది జనవరిలో గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డును అందుకుంది.

మరో మెట్టు పైకి..

మరో మెట్టు పైకి..

ఇప్పుడు మరో మెట్టు పైకి ఎక్కిందీ మూవీ. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ను అందుకుంది. ఈ సినిమాలోని సూపర్ హిట్ పాట నాటు నాటు.. ఈ కేటగిరీలో బెస్ట్ ఒరిజినల్ ట్రాక్ అవార్డును సొంతం చేసుకుంది. అమెరికా లాస్ ఏంజిలిస్ లోని డాల్బీ థియేటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీత రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ప్రశంసల సునామీ..

కాగా- ఈ అవార్డు దక్కడంపై చిత్రం యూనిట్‌పై ప్రశంసల సునామీ కురిసింది. ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో వేల సంఖ్యలో ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు జెండాను రెపరెపలాడించారని ప్రశంసించారు. తెలుగువాడికి ఇది గర్వకారణమని, మూవీ యూనిట్‌ను చూసి తాము గర్వపడుతున్నామని చెప్పారు.

తెలుగు జెండా..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆర్ఆర్ఆర్ టీమ్ ను అభినందించారు. విశ్వ వేదికపై తెలుగు జెండా రెపరెపలాడుతోందని కీర్తించారు. మన జానపద వారసత్వానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారని ప్రశంసించారు. తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు లభించడం పట్ల తాను గర్వపడుతున్నానని జగన్ వ్యాఖ్యానించారు. దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఎంఎం కీరణవాణి, గీత రచయిత చంద్రబోస్ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

తప్పుపట్టిన అద్నాన్ సమీ..

వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను ప్రముఖ నేపథ్య గాయకుడు అద్నాన్ సమీ తప్పుపట్టారు. నాటు నాటు పాటకు ప్రాంతీయతను కట్టబెట్టడం సరికాదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ కు జాతీయ భావాలు లేవని విమర్శించారు. మహా సముద్రాల గురించి ఆలోచన చేయలేని, ప్రాంతీయత అనే చెరువులో జీవిస్తోన్న కప్పగా అభివర్ణించారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. జాతీయ భావాల గురించి ఆయనకు బోధించడం దండగ అంటూ మండిపడ్డారు.

గతంలోనూ..

గతంలోనూ..

వైఎస్ జగన్ ఇలా.. విమర్శించడం అద్నాన్ సమీకి కొత్తేమీ కాదు. నాటు నాటు.. పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించిన సమయంలోనూ ఆయన జగన్ పై ఇలాంటి విమర్శలే చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందిస్తూ జగన్ ట్వీట్ చేయగా.. దానికి రిప్లై ఇచ్చారు. జగన్.. వేర్పాటు భావాలను రెచ్చగొడుతున్నాడంటూ ఆరోపించారు. భారతీయ సినిమా పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందని చెప్పకుండా.. తెలుగు పాట ఈ ఘనతను సాధించిందంటూ జగన్ చెప్పడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారాయన అప్పట్లో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+