తెలంగాణ స్పెషల్ 'చికెన్ పులావ్'..రుచి చూస్తే వావ్ అంటారు..!
సండే వచ్చిందంటే చాలు చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. చాలామంది రెస్టారెంట్స్ కు వెళ్లి బిర్యానీలు లాగించేస్తుంటారు. మరికొందరు ఇంట్లోనే చికెన్ ను ప్రిపేర్ చేసుకుంటారు. మరి ఎప్పుడూ బిర్యానీలు తిని బోర్ కొట్టిందా..? అయితే సూపర్ టేస్టీతో ఈ ఘుమఘుమలాడే తెలంగాణ స్పెషల్ 'చికెన్ పులావ్' ను ఎప్పుడైనా ట్రై చేశారా..? ఈ సండే ఇలా చేసుకోండి.. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలని కోరుకుంటారు. మరి సూపర్ టేస్టీ చికెన్ పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
చికెన్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే బాస్మతి బియ్యం రెండు కప్పులు, చికెన్ ముక్కలు 500 గ్రాములు, ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి నాలుగు చీల్చినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, పెరుగు అర కప్పు, పుదీనా ఆకులు పావుకప్పు, నూనె మూడు టేబుల్ స్పూన్లు, నెయ్యి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకులు రెండు, దాల్చిన చెక్క ఒక అంగుళం, యాలకులు నాలుగు, లవంగాలు నాలుగు, షాజీరా అర టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం ఒక కప్పు, గరం మసాలా అర కప్పు తీసుకోవాలి.
ఇక చికెన్ పులావ్ తయారీ విధానం చూస్తే ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత చికెన్ లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం, తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి 20 నిమిషాలు పాటు మేరినేట్ చేయాలి. ఆ తర్వాత పాన్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేసి, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి.

ఇప్పుడు మేరినేట్ చేసిన చికెన్ వేసి మంట ఓ మోస్తారు పై ఉంచి అలా కలుపుతూ 7 నుంచి 8 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యం వడకట్టి చేసి స్వల్పంగా కలపాలి. ఆ తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోయాలి. ఉప్పు వేసి మరిగించాలి. అలా మరిగిన తర్వాత మూతబెట్టి తక్కువ మంటపై 12 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మంటను ఆపి 5 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గరం మసాలా, పూదీనా, కొత్తిమీర వేసి స్వల్పంగా కలపాలి. ఇలా చికెన్ పులావ్ వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సరి..












Click it and Unblock the Notifications