NEET UG 2026 Re-Exam: నిమిషం దాటితే గేట్లు క్లోజ్. కొత్త రూల్స్ చెక్ చేసుకోండి!

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'నీట్‌ యూజీ-2026' పునఃపరీక్ష నేడు జరగనుంది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఈ పరీక్షను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 ప్రధాన కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది వైద్య విద్యా ఆశావాహులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షల సమర్థ నిర్వహణ కోసం ఏకంగా రెండు లక్షల మందికి పైగా సిబ్బంది సేవలను వినియోగిస్తున్నారు. అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు సామాజిక మాధ్యమాలపై కూడా ఎన్‌టీఏ నిఘా ఉంచింది.

NEET UG 2026 Re-Exam Today Check Important Documents Dress Code and Exam Timings Here in Detail

తెలుగు రాష్ట్రాల్లో 1.38 లక్షల మంది అభ్యర్థులు

ఈ పునఃపరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 185 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 65,790 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా 24 నగరాల్లో 208 కేంద్రాలను సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి 72,956 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

NEET ఇంత దుర్మార్గమా? నాగ్‌పూర్ కుర్రాడికి 'అబుదాబి'లో సెంటరా!
NEET ఇంత దుర్మార్గమా? నాగ్‌పూర్ కుర్రాడికి 'అబుదాబి'లో సెంటరా!

పరీక్ష సమయాలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు (మొత్తం 195 నిమిషాలు) పరీక్ష జరగనుంది. అయితే, అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను పూర్తిగా మూసివేస్తారు. ఆ తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోరని అధికారులు స్పష్టం చేశారు. సాధారణ అభ్యర్థులకు 5.15 గంటల వరకు సమయం ఉండగా, దివ్యాంగ (PwD/PwBD) అభ్యర్థులకు మాత్రం సాయంత్రం 6.20 గంటల వరకు పరీక్ష రాసేందుకు అదనపు సమయం కల్పించారు. ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం రఫ్ వర్క్ కోసం ప్రశ్నపత్రం బుక్‌లెట్‌లో గతంలో కంటే అదనంగా (మొత్తం నాలుగు పేజీలు) కేటాయించారు.

వెంట తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన పత్రాలు:

  • కొత్త అడ్మిట్ కార్డ్: పునఃపరీక్ష కోసం జారీ చేసిన సరికొత్త కలర్ ప్రింట్ అడ్మిట్ కార్డును మాత్రమే తీసుకురావాలి. పాత హాల్ టికెట్ చెల్లదు. అడ్మిట్ కార్డుపై నిర్దేశిత స్థలంలో పోస్ట్‌కార్డ్ సైజ్ ఫోటోను అతికించాలి.
  • గుర్తింపు కార్డు: ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్) తప్పనిసరి. మొబైల్‌లోని డిజిటల్ కాపీలు, జిరాక్స్ కాపీలు అంగీకరించబడవు.
  • అదనపు ఫోటోలు: హాజరు పట్టికలో అతికించడానికి అప్లికేషన్ సమయంలో అప్‌లోడ్ చేసిన లాంటివే కనీసం రెండు అదనపు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను తెచ్చుకోవాలి.
  • దివ్యాంగుల సర్టిఫికేట్: PwD కేటగిరీ అభ్యర్థులు తమ ఒరిజినల్ వైకల్య ధృవీకరణ పత్రాన్ని వెంట ఉంచుకోవాలి.
NEET రీఎగ్జామ్.. ఒత్తిడి తట్టుకోలేక హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య !!
NEET రీఎగ్జామ్.. ఒత్తిడి తట్టుకోలేక హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య !!

కఠినమైన డ్రెస్ కోడ్.. ఇవి పాటిస్తేనే అనుమతి!

పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలు అత్యంత కఠినంగా ఉండనున్నాయి. అభ్యర్థులు లైట్ కలర్ హాఫ్-స్లీవ్స్ షర్టులు లేదా టీ-షర్టులు, సాధారణ ప్యాంట్లు ధరించి రావాలి. పాదరక్షల విషయానికొస్తే కేవలం సాధారణ స్లిప్పర్లు లేదా తక్కువ హీల్ ఉన్న శాండల్స్‌కు మాత్రమే అనుమతి ఉంది.

నిషేధిత అంశాలు: ఫుల్-స్లీవ్ దుస్తులు, పెద్ద బటన్లు లేదా భారీ ఎంబ్రాయిడరీ ఉన్న బట్టలు, షూస్, సాక్స్ ధరించకూడదు. ఉంగరాలు, గొలుసులు, కమ్మలు వంటి ఎలాంటి నగలు పెట్టుకోకూడదు. మొబైల్స్, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు, వాలెట్లు, బెల్టులు, ఎలాంటి కాగితాలు, ఆహార పదార్థాలను కేంద్రాల్లోకి అనుమతించరు.

గమనిక: హిజాబ్, టర్బన్, కిర్పాన్ వంటి సాంప్రదాయ/మతపరమైన దుస్తులు ధరించే అభ్యర్థులు పటిష్ఠ భద్రతా తనిఖీల దృష్ట్యా చాలా ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+