కుటుంబ కలహాలు: మైసూరులో ఆంధ్రా టెక్కీ ఆత్మహత్య

A techie commits suicide in Mysore
మైసూరు: కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని కర్నూలు జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (26) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఏడాది క్రితం అతనికి వివాహమైంది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు తెలిపారు.

విజయనగర పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నూలు నగరానికి చెందిన చంద్రశేఖర్ కుమారుడు లక్ష్మీనారాయణ మైసూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అతను పని చేస్తున్న కంపెనీకి సమీపంలోని విజయనగర ప్రాంతంలో నివాసముంటున్నారు. ఏడాది క్రితం అరుణ అనే యువతిని వివాహం చేసుకున్నారు.

అయితే లక్ష్మీనారాయణ, అరుణల మధ్య కొద్ది రోజుల్లోనే మనస్పర్థలు రావడంతో, ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో బుధవారం ఫోన్‌లో మాట్లాడుకున్న సందర్భంలో ఇద్దరూ గొడవ పడ్డట్లు తెలిసింది. ఈ తర్వాత రాత్రి 8 గంటల సమయంలో లక్ష్మీనారాయణకు అరుణ మరోసారి ఫోన్ చేసింది. అయితే అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, అతని ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పింది.

దీంతో ఇంటి యజమాని లక్ష్మీనారాయణ గదికి వెళ్లి చూశాడు. అయితే అతను అప్పటికే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో ఇంటి యజమాని అరుణతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, లక్ష్మీనారాయణ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+