బెంగళూరులో తెలుగు టెక్కీ మిస్సింగ్: ఆందోళనలో తల్లిదండ్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాసులు రెడ్డి బెంగళూరులో అదృశ్యమయ్యాడు. గత నాలుగేళ్లుగా శ్రీనివాసులు బెంగళూరులో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
నెల్లూరు/బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాసులు రెడ్డి బెంగళూరులో అదృశ్యమయ్యాడు. గత నాలుగేళ్లుగా శ్రీనివాసులు బెంగళూరులో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
కాగా, రోజువారిగా విధులకు వెళ్లిన శ్రీనివాసులు సాయంత్రం ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా కలవకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాప్ట్‌వేర్ ఇంజనీర్ కోసం గాలిస్తున్నారు. కాగా శ్రీనివాసులు రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం బండకిందపల్లె. శ్రీనివాసులు అదృశ్యంపై వారి బంధువుల్లోనూ ఆందోళన నెలకొంది.












Click it and Unblock the Notifications