స్నానం చేస్తోంటే వీడియో తీసి ఏడాదిగా అత్యాచారం, శీలానికి వెలకట్టిన గ్రామపెద్దలు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయనగరం:ఓ మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫోటోలు వీడియోలు తీసి ఏడాదిపాటు ఆమెను లొంగదీసుకొన్నాడు ఓ దుర్మార్గుడు.ఏడాదిపాటు భరించిన ఆ బాధితురాలు గ్రామస్థులకు చెప్పినా ప్రయోజనం లేకపోయింది.ఇక తనకు న్యాయం జరగలేదని భావించిన బాధితురాలు కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్ని మంచి కంటే చెడుకు ఎక్కువగా ఉపయోగించుకొంటున్నవారి సంఖ్య పెరిగిపోయింది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ వివాహిత ఏడాదిగా నరకం అనుభవిస్తోంది.

తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపిస్తోంది.అంతేకాదు ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు చెప్పినందుకుగాను తనతో పాటు తన భర్తను నిందితుడు చంపేందుకు ప్రయత్నించారని బాధితురాలు కలెక్టర్ , ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

ఏడాదిపాటుగా ఈ బాధను అనుభవించిన ఆ మహిళ ఇక చేసేదిలేక కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.అయితే దీనికి స్థానికంగా ఉన్న పోలీసులు సక్రమంగా వ్యవహరించలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.

స్నానం చేస్తోంటే వీడియో తీసి బ్లాక్ మెయిల్

స్నానం చేస్తోంటే వీడియో తీసి బ్లాక్ మెయిల్

విజయనగరం జిల్లా జామి మండలం బలరాంపురంలో తమ పక్కింటిలోని ఉంటున్న యేమల శ్రీనివాస్ అనే వ్యక్తి తాను స్నానం చేస్తుండగా ఫోటోలు, వీడియోలు తీశారని తెలిపింది.ఈ ఫోటోలను వీడియోలను చూపి ఏడాదిపాటు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆవేదన చెందుతోంది. అయితే తాను కోరిక తీర్చకపోతే తన ఫోటోలు, వీడియోలను వాట్సాప్, ఫేస్ బుక్ లలో పోస్ట్ చేస్తానని బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది.

శీలానికి వెల కట్టిన గ్రామపెద్దలు

శీలానికి వెల కట్టిన గ్రామపెద్దలు

ఏడాది పాటు నిందితుడు ఆ వివాహితను బ్లాక్ మెయిల్ చేసిఅత్యాచారానికి పాల్పడ్డాడు.అయితే ఈ విషయమై గ్రామ పెద్దలకు చెబితే న్యాయం జరుగుతోందని వివాహిత బావించింది.అయితే ఈ విషయమై బాధితురాలు గ్రామపెద్దలను ఆశ్రయిస్తే ఆమె శీలానికి వెల కట్టారు. నిందితుడి నుండి ఫోటోలు, వీడియోలను తీసుకొని వివాహితకు అప్పగించారు.కొంత నగదును శ్రీను నుండి ఇప్పిస్తామని గ్రామ పెద్దలు తీర్మాణం చేశారని బాధితురాలు చెప్పారు.

చంపేందుకు శ్రీను కుట్ర

చంపేందుకు శ్రీను కుట్ర

అయితే గ్రామ పెద్దలతో పంచాయితీ పెట్టినందుకు కక్ష పెంచుకొన్న నిందుతుడు శ్రీనివాస్ తమపై కక్ష పెంచుకొన్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.తమ ఇంట్లో దూరి తనపై, తన భర్తపై హత్యయత్నానికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్పారు. శ్రీనివాస్ దాడిలో తీవ్రంగా గాయపడిన తన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందాడని ఆమె చెప్పారు.

ఆసుపత్రి నుండి ఇంటికి రాకముందే బెయిల్ పై నిందితుడు

ఆసుపత్రి నుండి ఇంటికి రాకముందే బెయిల్ పై నిందితుడు

తాము ఆసుపత్రి నుండి ఇంటికి రాకముందే నిందితుడు బెయిల్ పై ఇంటికి వ చ్చాడని బాధితురాలు ఆరోపించారు.అయితే పోలీసులు సక్రమంగా వ్యవహరించలేదని ఆమె ఆరోపిస్తున్నారు.కేసును విత్ డ్రా చేసుకోవాలని పోలీసులు చెప్పారని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయమై తనకు న్యాయం జరిపించాలని కోరుతూ కలెక్టర్, ఎస్పీని ఆమె సోమవారం నాడు కలిశారు.తనకు న్యాయం చేయాలని బాధితురాలు వారిని కోరింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman complaint against Srinivas in Vijayanagaram district on Monday. Srinivas rape on her from the past one year.she was complaint on Monday to collector and sp.
Please Wait while comments are loading...