• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కు ఆంధ్రజ్యోతి ఆర్కే లీగల్ నోటీసుల జారీ...బహిరంగ క్షమాపణకు డిమాండ్

By Suvarnaraju
|
  తెలుగు సినీ ఫీల్డ్ కు వార్నింగ్ ఇచ్చిన చలసాని శ్రీనివాస్‌

  తనపై తన మీడియా సంస్థలపై ట్వీట్ల యుద్దం చేస్తున్న పవన్ కళ్యాణ్ అందుకు ప్రతిగా మరో మీడియా దిగ్గజం నుంచి లీగల్ నోటీసులు అందుకున్నాడు. "ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌" ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆయనకు ఈ లీగల్ నోటీసులు జారీ చేశారు.

  పవన్ తనకు సంబంధించిన ట్వీట్లన్నీ తొలగించి లిఖితపూర్వక బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆర్కే డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. లేనిపక్షంలో తాను తీసుకునే సివిల్‌, క్రిమినల్‌ పరువు నష్టం దావాకు సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ను "ఆంధ్రజ్యోతి-ఏబీఎన్" ఎండీ ఆర్కే తన లీగల్ నోటీసుల ద్వారా పవన్ ను హెచ్చరించినట్లు సమాచారం. అయితే టివి 9 ఛైర్మన్ పంపిన లీగల్ నోటీసులు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పవన్, ఆర్కే పంపిన నోటీసులు పోస్ట్ చేయకపోవడంతో అవి ఇంకా ఆయనకు అందివుండకపోవచ్చని భావిస్తున్నారు.

   ఆర్కే...లీగల్ నోటీసులు

  ఆర్కే...లీగల్ నోటీసులు

  తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా ట్విటర్‌లో అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిస్తూ "ఆంధ్రజ్యోతి-ఏబీఎన్" ఎండీ వేమూరి రాధాకృష్ణ తన న్యాయవాది ద్వారా పవన్‌ కళ్యాణ్ కు లీగల్‌ నోటీసు పంపించినట్లు తెలిసింది. తనపైనా, తన సంస్థపైనా చేసిన ఊహాజనిత, నిరాధార ఆరోపణలను, ట్వీట్లను బేషరతుగా ట్విటర్‌ నుంచి తొలగించచడంతో పాటు పవన్ తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన తన నోటీసులో డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. లేనిపక్షంలో తాను తీసుకోబోయే సివిల్‌, క్రిమినల్‌ చర్యలతో పాటు పరువు నష్టం దావాను ఎదుర్కోవడానికి పవన్‌కల్యాణ్‌, ఆయన వెనుక ఉన్నవారు సిద్ధంగా ఉండాలని ఆర్కే ఆ నోటీసులో హెచ్చరించినట్లు సమాచారం.

  వ్యక్తిగత లోపాలు...కప్పిపుచ్చుకునేందుకే

  వ్యక్తిగత లోపాలు...కప్పిపుచ్చుకునేందుకే

  పవన్ కళ్యాణ్ తనలోని వ్యక్తిగత, రాజకీయ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే కావాలని, ఉద్దేశపూర్వకంగా చేసిన ఆ ట్వీట్లు చేశారని, వాటిల్ ఏమాత్రం వాస్తవం లేదని తన నోటీసుల్లో ఆర్కే పేర్కొన్నారట. "ఆంధ్రజ్యోతి-ఏబీఎన్" వార్తా సంస్థలు...నియంత్రణ సంస్థల నిబంధనలకు లోబడి పనిచేస్తాయనే ఆర్కే అందులో గుర్తు చేశారట. పవన్‌ ఆరోపించిన విధంగా టీఆర్పీ కోసం మహిళలను దూషించే అలవాటు తమ మీడియా సంస్థలకు లేదని ఆర్కే తేల్చేశారట.

  సమాజానికి మీడియా చేసే మేలును తగ్గించి చూపడం రాజకీయనాయకులకు అలవాటైన పనేనని...అయితే, లింగ అసమానతలపై "ఆంధ్రజ్యోతి-ఏబీఎన్" చేసిన యుద్దం గురించి పవన్‌కల్యాణ్‌ మర్చిపోవడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్‌ ఆరోపిస్తున్నట్లుగా తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు గానీ, ఏ పార్టీ వైపూ మొగ్గు గానీ లేదని ఆర్కే స్పష్టం చేశారని తెలుస్తోంది.

   మీ వల్ల నష్టం...మాపై కుట్ర

  మీ వల్ల నష్టం...మాపై కుట్ర

  ట్విట్టర్‌లో తమపై అనుచితమైన యుద్ధం ప్రకటించిన పవన్‌ కొద్దిరోజులుగా వరుస ట్వీట్లతో ఆయన అభిమానుల్లో తీవ్ర అసహనం పెంచారని, దీంతో పవన్‌ అభిమానులు "ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌" రిపోర్టర్లపై దాడి చేసి గాయపరిచారని, ఓబీవ్యాన్‌ను ధ్వంసం చేశారని ఆర్కే గుర్తుచేసినట్లు తెలిసింది. ఏవిధమైన ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్‌ ట్విటర్‌లో తనపై ఈ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆర్కే పేర్కొన్నారట.

  నానాటికి

  పడిపోతున్నతన రాజకీయ ప్రతిష్ఠను పునరుద్ధరించుకోవడానికే పవన్‌ తనపై ఇలా ఊహాజనిత, వండివార్చిన ట్వీట్లను పోస్ట్‌ చేస్తున్నారని ఆర్కే తెలిపారట. నేరపూరిత కుట్రలో భాగంగానే పవన్‌, మరికొందరితో కలిసి ఈ ట్వీట్లు చేస్తున్నారని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు, ఆ ట్వీట్ల వల్ల తనకు, తన సంస్థలకు తీవ్ర నష్టం కలిగిందని, ఎన్నో ప్రశ్నలను, అవహేళనలను ఎదుర్కోవాల్సి వచ్చిందని, తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిందని ఆర్కే ఆ నోటీసులో సోదాహరణంగా వివరించినట్లు తెలిసింది. అందువల్ల ఆ ట్వీట్లపై తగు వివరణ ఇచ్చి బేషరతుగా, రాతపూర్వకంగా, బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ట్వీట్లను తొలగించాలని పవన్ కళ్యాణ్ ను ఆర్కే డిమాండ్‌ చేసినట్లు చెబుతున్నారు.

  ఆర్కే నోటీసు...ఇంకా అందలేదా?...

  ఆర్కే నోటీసు...ఇంకా అందలేదా?...

  కొన్ని మీడియా సంస్థలు,వాటి బాధ్యులపై తాను చేసిన ట్వీట్ల యుద్దానికి ఆయా సంస్థల ప్రతినిధుల నుంచి తాను అందుకున్న లీగల్ నోటీసులను సైతం పవన్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు టివి 9 ఛైర్మన్ శ్రీనీ రాజు ఈ తరహా లీగల్ నోటీసు ఇవ్వగా ఆ నోటీసును సైతం పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఆయనకు "ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌" ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా లీగల్ నోటీసు పంపినట్లు తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఆ లీగల్ నోటీసు గురించి ప్రస్తావించడం గానీ, లేదా దాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం గానీ చేయక పోవడంతో బహుశా ఆ లీగల్ నోటీసు పవన్ కళ్యాణ్ కు ఇంకా అంది ఉండదని పవన్ అభిమానులు, మద్దతుదారులు భావిస్తున్నారు. ఆ లీగల్ నోటీస్ పవన్ చేతికి అంది ఉంటే ఈ పాటికే ఆయన దాన్ని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఉండేవాడని అభిప్రాయపడుతున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Jyothi, ABN channel MD Radha Krishna served legal notice to Janasena Party chief Pawan Kalyan over his tweets. In this notice, RK demanded that Pawan Kalyan should delete baseless tweets from his account and tender an open apology. He warned that he would file defamation cases on Pawan if he doesn’t remove the controversial tweets from twitter and tender public apology.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more