ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఐటీ విభాగం పెద్ద చేప (ఫోటోలు)

విశాఖపట్నం: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో మరో చేప చిక్కింది. ఒక కాంట్రాక్టర్ వద్ద నుంచి ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్ధ (జీవీఎంసీ) ఐటీ విభాగం ఓఎస్‌డీ సువారి గొవిందరావు సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ ఎం. నరసింహారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏపీ ట్రాన్స్‌కోలో డీఈగా పని చేస్తున్న గోవిందరావు డిప్యూటేషన్‌పై జీవీఎంసీకి వచ్చారు. ప్రస్తుతం ఐటీ విభాగం ఓఎస్‌డీగా విధులు నిర్వహిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా గల్లా శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ జీవీఎంసీలో పనులు చేస్తున్నారు. ఆయ పనులకు సంబంధించి బిల్లులు చెల్లించేందుకు అవసరమైన నిధులు లేకుండా పోయాయి. దీంతో ఐటీ విభాగం నుంచి నిధులు కేటాయిస్తామని గోవిందరావు తెలిపారు. ఇందుకోసం తనకు పది వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతమొత్తం ఇచ్చుకోలేనని కాంట్రాక్టర్ శ్రీనివాస్ పేర్కొనడంతో ఎనిమిది వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది.

ఐతే లంచం ఇవ్వడం ఇష్టం లేని శ్రీనివాస్ ఈ విషయమై ఏసీబీ అధికారులకు తన వద్ద సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న అనిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచన మేరక అనిల్ ఓఎస్‌డీకి లంచం కింద ఎనిమిది వేల రూపాయలను సోమవారం జీవీఎంసీ ఆయన ఛాంబర్‌లో అందజేశారు.

గోవిందరావు లంచం తీసుకున్న వెంటనే అప్పటికే అక్కడ మాటువేసి ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం కింద తీసుకున్ననగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేరం ఐటీ ఓఎస్‌డీ గోవిందరావుతో పాటు ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేస్తున్న రవికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు. గతంలో మంచి నీటి సరఫరా విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణరాజును కూడా ఇదే నేరం కింద ఏసీబీ అధికారులకు కాంట్రాక్టర్ గల్లా శ్రీనివాస్ పట్టించాడు.

ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఐటీ అధికారి

ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఐటీ అధికారి

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో మరో చేప చిక్కింది. ఒక కాంట్రాక్టర్ వద్ద నుంచి ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్ధ (జీవీఎంసీ) ఐటీ విభాగం ఓఎస్‌డీ సువారి గొవిందరావు సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఐటీ అధికారి

ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఐటీ అధికారి

ఇది ఇలా ఉండగా గల్లా శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ జీవీఎంసీలో పనులు చేస్తున్నారు. ఆయ పనులకు సంబంధించి బిల్లులు చెల్లించేందుకు అవసరమైన నిధులు లేకుండా పోయాయి. దీంతో ఐటీ విభాగం నుంచి నిధులు కేటాయిస్తామని గోవిందరావు తెలిపారు.

ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఐటీ అధికారి

ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఐటీ అధికారి

ఇందుకోసం తనకు పది వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతమొత్తం ఇచ్చుకోలేనని కాంట్రాక్టర్ శ్రీనివాస్ పేర్కొనడంతో ఎనిమిది వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది.

 ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఐటీ అధికారి

ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఐటీ అధికారి

ఐతే లంచం ఇవ్వడం ఇష్టం లేని శ్రీనివాస్ ఈ విషయమై ఏసీబీ అధికారులకు తన వద్ద సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న అనిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచన మేరక అనిల్ ఓఎస్‌డీకి లంచం కింద ఎనిమిది వేల రూపాయలను సోమవారం జీవీఎంసీ ఆయన ఛాంబర్‌లో అందజేశారు.

 ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఐటీ అధికారి

ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఐటీ అధికారి

గోవిందరావు లంచం తీసుకున్న వెంటనే అప్పటికే అక్కడ మాటువేసి ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం కింద తీసుకున్ననగదును స్వాధీనం చేసుకున్నారు.

 ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఐటీ అధికారి

ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఐటీ అధికారి

ఈ నేరం ఐటీ ఓఎస్‌డీ గోవిందరావుతో పాటు ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేస్తున్న రవికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు. గతంలో మంచి నీటి సరఫరా విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణరాజును కూడా ఇదే నేరం కింద ఏసీబీ అధికారులకు కాంట్రాక్టర్ గల్లా శ్రీనివాస్ పట్టించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+