లంచావతారులు: ఏసిబికి చిక్కిన జివిఎంసి ఈఈ(పిక్చర్స్)
విశాఖపట్నం: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి)లో లంచావతారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. సర్టిఫికెట్ ఇవ్వాలంటే లంచం, నిర్మాణాలకు అనుమతివ్వాలంటే లంచం, చివరకు జివిఎంసి చేపట్టే పనులను కేటాయించేందుకు సైతం లంచం తీసుకుంటూ తమ ధన దాహానికి అడ్డులేదని నిరూపిస్తున్నారు.
ఇప్పటి వరకూ టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్య విభాగానికే ఎక్కువ పరిమితమైన అవినీతి జరగ్గా, తాజాగా అది మంచినీటి విభాగానికి సైతం పాకింది. మంచినీటి విభాగంలో పనులను నామినేషన్ ప్రాతిపదికన కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిన కార్యనిర్వాహక ఇంజనీర్ ఒకరు మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.
టిఎస్సార్ కాంప్లెక్స్‌లోని మంచినీటి సరఫరా విభాగంలో ఈఈగా పనిచేస్తున్న కాంతారావు పనులను నామినేషన్ ప్రాతిపదికన కేటాయించేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.14వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టరు ఏసిబిని ఆశ్రయించారు.
లంచం సొమ్మును తీసుకుంటుండగా ఏసిబి డిఎస్పీ రామకృష్ణ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. దీంతో జివిఎంసి ఉద్యోగుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. గతంలో టౌన్‌ప్లానింగ్ విభాగంగలో పలువురు బిల్డింగ్ ఇనస్పెక్టర్లు, ఇతర ఉద్యోగులు ఏసిబి చేతికి చిక్కారు.
ఇది ఇలా ఉండగా, నీటిని వెదజల్లే లారీలకు అనుమతి కోసం రూ. 4వేలు లంచం తీసుకుంటూ పోర్టు ట్రస్ట్ ట్రాఫిక్ విభాగానికి చెందిన ఫోర్‌మన్ మాధవ వర్మ కూడా ఏసిబికి పట్టుబడ్డాడు.

ఏసిబి దాడులు
మంచినీటి విభాగంలో పనులను నామినేషన్ ప్రాతిపదికన కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిన కార్యనిర్వాహక ఇంజనీర్ ఒకరు మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.

ఏసిబి దాడులు
టిఎస్సార్ కాంప్లెక్స్‌లోని మంచినీటి సరఫరా విభాగంలో ఈఈగా పనిచేస్తున్న కాంతారావు పనులను నామినేషన్ ప్రాతిపదికన కేటాయించేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.14వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టరు ఏసిబిని ఆశ్రయించారు.

ఏసిబి దాడులు
లంచం సొమ్మును తీసుకుంటుండగా ఏసిబి డిఎస్పీ రామకృష్ణ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. దీంతో జివిఎంసి ఉద్యోగుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.

ఏసిబి దాడులు
గతంలో టౌన్‌ప్లానింగ్ విభాగంగలో పలువురు బిల్డింగ్ ఇనస్పెక్టర్లు, ఇతర ఉద్యోగులు ఏసిబి చేతికి చిక్కారు.

ఏసిబి దాడులు
నీటిని వెదజల్లే లారీలకు అనుమతి కోసం రూ. 4వేలు లంచం తీసుకుంటూ పోర్టు ట్రస్ట్ ట్రాఫిక్ విభాగానికి చెందిన ఫోర్‌మన్ మాధవ వర్మ కూడా ఏసిబికి పట్టుబడ్డాడు.












Click it and Unblock the Notifications