వోల్వో బస్సు ప్రమాదం: రసాయనాల వల్లే మంటలు?

Accident: How the fire spread in Volvo bus
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలెం దగ్గర వోల్వో బస్సు దగ్ధమైన ప్రమాదానికి గల కారణాలు బయటకు వస్తున్నాయి. ప్రత్యేక పరిశీలన బృందాలు రెండు, మూడు రోజుల నుండి తరచుగా ప్రమాద స్థలాన్ని నిశితంగా పరిశీలించి ప్రమాదానికి గురైన బస్సు క్షణాల్లోనే దగ్ధం కావడానికి గల కారణాలను కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం వనపర్తి సిఐ గిరిబాబుతో పాటు మరికొందరు పోలీసులు బెంగుళూర్‌కు వెళ్లారు. జబ్బార్ ట్రావెల్స్ నిర్వాహకులను విచారించారు. అదేవిధంగా ప్రయాణికుల వివరాలను, వారి దగ్గర ఉన్న సామాగ్రిపై కూడా విచారణ మొదలుపెట్టారు. జబ్బార్ ట్రావెల్స్ నిర్వాహకులు మరికొందరిని మహబూబ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం.

ఇప్పటికే జబ్బార్ ట్రావెల్స్ డైరెక్టర్ షకీల్, డ్రైవర్ ఫిరోజ్‌పాషలను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ముఖ్యంగా బస్సులో ఆరు క్యాన్లలో ప్రమాదకర రసాయన పదార్థాలను కూడా తరలిస్తున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. అదేవిధంగా ఆరు విగ్గులు (తల వెంట్రుకలు) కూడా ఉన్నట్లు గుర్తించారు. అగ్నికి మరింత ఆజ్యంపోసే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా బస్సులో ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు. ఏ ప్రమాదం జరిగినా క్షణాల్లో బస్సు దగ్ధం కావడం, అందులో 45 మంది ప్రయాణికులు సజీవదహనం కావడం బట్టి చూస్తే బస్సులో రసాయన పదార్థాలు ఉన్నందువల్లే బస్సుకు మంటలు త్వరగా వ్యాపించి ఉంటాయని కూడా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

డివైడర్‌ను ఢీకొని వోల్వో బస్సు డీజిల్ ట్యాంకర్ పగిలిపోవడం జరిగినప్పటికీ బస్సు పూర్తిగా దగ్ధం కావడం మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడం రసాయన పదార్థాలే ముఖ్య కారణమని పరిశీలన బృందాలు భావిస్తున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ప్రమాదానికి గురైంది నిజమని కూడా తేల్చేశారు. అయితే ఈ ప్రమాదం ఈ స్థాయిలో జరగడానికి, ఏకంగా 45 మంది సజీవదహనం కావడానికి బస్సులోని ప్రమాదకర రసాయన పదార్థాలు కారణమని అంటున్నారు.

19 మృతదేహాల గుర్తింపు

ప్రమాదంలో మరణించిన 45 మందిలో ఇప్పటివరకు 22 మృతదేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలోనే ముగ్గురి మృతదేహాలను గుర్తించగా, సోమవారం మరో 19 మృతదేహాలను గుర్తించినట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. హైదరాబాద్‌లో డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించిన అనంతరం 19 మృతదేహాలను గుర్తించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు.

మృతదేహాలను సోమవారం బంధువులకు అప్పగించినట్లు చెప్పారు. మిగతా మృతదేహాలను కూడా గుర్తించే ప్రక్రియ చురుకుగా కొనసాగుతుందని, వాటిని ఒకటి, రెండు రోజుల్లో బంధువులకు అప్పగిస్తామని అన్నారు. గుర్తించిన మృతదేహాలలో ప్రశాంత్‌గుప్త, శివకిరణ్, వేదావతి, రవి, ఎండి సర్ధార్, అశుతోష్ పాండా, అక్షయ్‌సింగ్, ఎం. ఫణికుమార్, ఎన్‌ఎస్ గిరిధర్, జి.బాలసుందర్‌రాజ్, జి.మర్రి విజయకుమారి, జ్యోతి రంజాన్‌సాహు, సయ్యద్ మహ్మద్ జమాలోద్దీన్, ఎన్.రోహియా, వెంకటేష్, మోసిన్‌పాష, రఘువీర్, కె.రమ్య, సాకిబ్ ఆహ్మద్ ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+