మాటలు చెప్పి ప్రేయసి హత్య: ప్రియుడి అరెస్టు

Arrest symbol
నల్లగొండ: మాయమాటలు చెప్పి, ప్రేయసిని హత్య చేసిన ప్రియుడిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన గోలి కవిత హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. రాచర్ల మండలం అనుములవీడు గ్రామానికి చెందిన బాలకృష్ణ దేవరకొండలోని ఖాదర్ కళాశాలలో నిరుడు ఎంబిఎ పూర్తి చేశాడు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - చదువుకుంటున్న సమయంలోనే తనకు జూనియర్ గోలి కవితతో పరిచయం ఏర్పడింది. రాములు అనే వ్యక్తి కూతురు కవిత అతనితో కొన్నాళ్లు ప్రేమవ్యవహారం నడిపింది. ఇటీవల కవితకు పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా జరగడంతో ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరించిన కవిత బాలకృష్ణను దూరం పెట్టింది.

దాంతో బాలకృష్ణ ఆమెపై కక్ష కట్టాడు. ఆమె హత్యకు పథకం వేశాడు. ఈ నెల 11వ తేదీన దేవరకొండకు వచ్చిన అతను కవితకు ఫోన్ చేసి ఓసారి మాట్లాడాలని చెప్పి పట్టణానికి సమీపంలోి కాసారం గుట్టల్లోకి తీసుకుని వెళ్లాడు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని ప్రేరేపించాడు.

ముందుగా తెచ్చుకున్న క్రిమిసంహారక మందును ఆమె చేత బలవంతంగా తాగించాడు. కవిత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో చావలేదని నిర్దారించుకున్న బాలకృష్ణ కత్తితో గొంతు కోశాడు. పోలీసులను నమ్మించడానికి తను కూడా తక్కువ మోతాదులో క్రిమిసంహారక మందు తాగాడు. ఆ తర్వాత బైక్‌పై పట్టణానికి తిరిగి వచ్చాడు.

ఖాదర్ కళాశాల అధ్యాపకుడైన శ్రవణ్ వద్దకు వెళ్లి తాను విషం తాగినట్లు చెప్పి స్పృహ తప్పాడు. దీంతో బాలకృష్ణను శ్రవణ్ ఆస్పత్రికి చేర్చాడు. కాసారం గుట్టలో యువతి హత్య విష,యం వెలుగులోకి రావడం, బాలకృష్ణ వ్యవహార శైలిపై అనుమానం రావడంతో అతనిపై విచారణ జరిపారు.

కవితను తానే హత్య చేసినట్లు బాలకృష్ణ పోలీసుల ముందు అంగీకరించాడు. హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే శ్రవణ్ మానవతా దృక్పథంతోనే బాలకృష్ణను ఆస్పత్రిలో చేర్చాడని, హత్య విషయం ఆయనకు తెలియదని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+