కాపురానికి రాలేదని భర్త యాసిడ్ దాడి: చికిత్స పొందుతూ చెన్నైలో మహిళ మృతి
చిత్తూరు: జిల్లాలోని తిరుపతిలో యాసిడ్ దాడికి గురైన వివాహిత జరీనా బేగం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. జులై 15న జారీనా బేగంపై ఆమె మాజీ భర్త అమ్లదాడికి పాల్పడ్డాడు.
గత 45 రోజులుగా చికిత్స పొందుతున్న జరీనా బేగం శనివారం ఉదయం మృతిచెందారు. జరీనాబేగం పీలేరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. వ్యాపారవేత్తనంటూ మోసం చేసి జరీనాను పెళ్లి చేసుకున్నాడు నిందితుడు సాజిద్. దీంతో విషయం తెలిసిన తర్వాత జరీనా అతడ్ని నుంచి విడిపోయింది. ఆదాయం తెచ్చిపెట్టే భార్య తన నుంచి దూరమైందన్న కోపంతో నిందితుడు ఆమెపై గతంలో ఓసారి కత్తితో దాడి చేశాడు.

దీనిపై జరీనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. నిందితుడ్ని మందలించి వదిలేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే నిందితుడు జరీనాపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన జరీనాను చెన్నై ఆస్పత్రికి తరలించారు. గత 45రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె నేటి ఉదయం మృతి చెందారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. తనను నుంచి దూరమైనందునే జరీనాపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు.












Click it and Unblock the Notifications