ఐదు లక్షలు తీసుకున్నారు, వేధిస్తున్నారు: పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వడమాలపేట ఎస్‌ఐ, మరో ఇద్దరు పోలీసులపై ఎర్రచందనం వ్యవహారానికి సంబంధించి కేసు నమోదైంది. స్మగ్లింగ్ కేసు నుంచి తప్పిస్తామని రూ.5 లక్షలు తీసుకుని, మళ్లీ రూ.5 లక్షల కోసం వేధిస్తున్నారంటూ రేణిగుంటకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ శివ ఫిర్యాదు చేశాడు.
దాంతో రేణిగుంట అర్బన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. స్మగ్లర్ శివపై రేణిగుంట, వడమాలపేట పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఇటీవల శివను ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి స్టేషనుకు తీసుకెళ్లారు. హెడ్ కానిస్టేబుల్ కుమార్, కానిస్టేబుల్ చినబాబు ద్వారా ఓ ఇంట్లో నిర్బంధించారు. చిత్ర హింసలకు గురిచేశారనే ఆరోపణలు వచ్చాయి

కేసు నుంచి బయట పడాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండు చేశారు. దాంతో అప్పు తీసుకొచ్చి ఎస్‌ఐకి ఇచ్చాడు శివ. పది రోజులుగా మరో రూ.5 లక్షలు తెచ్చివ్వాలని, లేదంటే అరెస్టు చే స్తానని మధ్యవర్తి గంగాధర్ ద్వారా బెదిరించారని ఆ ఫిర్యాదులో శివ చెప్పాడు
దీనిపై ఎస్పీ గోపీనాథ్‌కు డీఎస్పీ నంజుండప్ప సమాచారమిచ్చారు. దీనిపై డీఎస్పీ ఇతర అధికారులు గురువారం వడమాలపేట వచ్చి కుమార్, చినబాబును విచారించా రు. ఎస్‌ఐ అందుబాటులో లేడు. హెచ్‌సీ, పీసీల వద్ద రూ.4 లక్షల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు.
ఎస్‌ఐ, పోలీసులు డబ్బు తీసుకుంది వాస్తవమేనని ఐజీ వేణుగోపాలకృష్ణ తెలిపారు. విచారణ నివేదిక అందిన వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications