కూటమి నేతలకు నటుడు చురకలు..ట్వీట్ వైరల్
ఏపీలో కూటమి విజయం సాధించడంతో పార్టీల నేతల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. 164 సీట్లలో కూటమి నేతలు విజయం సాధించడంతో మూడు పార్టీల నేతల్లో ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. జనసేన తరుఫున పోటీ చేసిన నేతలందరూ ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

ఇక కూటమి విజయంపై సినీ , రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ముఖ్యంగా కూటమి విజయం సాధించాలని సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కోరుకుంది. వారు ఆశించినట్టుగానే కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.ఈ విజయంపై మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, ప్రభాస్ మొదలగు సెలబ్రిటీలందరూ స్పందిస్తున్నారు. తాజాగా కూటమి విజయంపై నటుడు బ్రహ్మాజీ స్పందించారు. కూటమి విజయం సాధించినందుకు విషెష్ చెబుతూనే నేతలకు ఆయన కీలక సూచనలు చేశారు. ఏపీ ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉంది.
Busy shooting #puspha .. pl get back to work.. excitement n entertainment over.. AP is in safe hands.concentrate on your future.. no point of trolling .. let’s us work for ourselves for better future.. vaallu thappu chesthe ..Malli Meru ade thappu cheyyakoodadu kada .. 🙏🏼 ..
— Brahmaji (@actorbrahmaji) June 6, 2024
వారు చేసిన తప్పును మీరు చేయొద్దు. వాళ్లు తప్పు చేశారని మీరు కూడా తప్పు చేయకూడదు కదా అని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుపై దృష్టిపెట్టండి. మంచి భవిష్యత్తు కోసం అందరం కలిసి పని చేద్దాం అంటూ బ్రహ్మాజీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. కూటమి గెలిచిన తర్వాత ఏపీలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ నేతలు వైసీపీ క్యాడర్‌పై దాడులకు తెగబడుతున్నారు. ఈక్రమంలోనే బ్రహాజీ తన ట్వీట్‌లో ఈ ప్రస్తావన చేసినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications