పొంగనాల పోశెట్టీ.. నోరు మెదపరేంటి సామీ ! పవన్, బాబుపై శ్యామల సెటైర్లు..!

చిత్తూరు జిల్లా పుంగనూరులో బాలిక హత్య ఘటనపై విపక్ష వైసీపీ తీవ్రంగా స్పందిస్తోంది. ఇదే క్రమంలో యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఎక్స్ లో ఘాటు వ్యాఖ్యలతో ఓ వీడియో పోస్ట్ పెట్టారు. ఇందులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పాలనలో ఏం జరుగుతుందో వివరిస్తూ పలు సెటైర్లు కూడా వేశారు.

పుంగనూరు బాలిక ఘటనపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్రంగా స్పందించారు. " నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. ఆడిపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది, ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసి బిడ్డలు సైతం జంకుతున్నారు." అంటూ ఎక్స్ లో శ్యామల ఓ పోస్టు పెట్టారు.

actor ysrcp spokesperson syamala targets chandrababu pawan kalyan on punganur girl incident

అంతే కాదు.." పొద్దుకు పదిసార్లు పొంగనాలు కొట్టే పోశెట్టీ.. పుంగనూరు ఘటనపై ఏమంటావు చెప్పూ..అన్నయ్యా అన్నావంటే ఎదురవనా అంటూ ఎన్నికల్లో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలపై నోరు మెదపరేంటి సామీ.. రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో ఆడ పిల్లలకు రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు." అని విమర్శించారు.

అలాగే "మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం. బాబు గారూ మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఇంత అఘాయిత్యం జరిగితే మీకేమీ అనిపించడం లేదా అండీ.. బాబొస్తే అదొస్తుంది, బాబొస్తే ఇదొస్తుంది ఇవన్నీ దేవుడెరుగు.. ప్రాణాలు పోతున్నాయి సార్ మీరొచ్చాక." అంటూ శ్యామల వీడియో ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+