పవన్ కల్యాణ్ పై అనసూయ సంచలన వ్యాఖ్యలు
సమాజంపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నటి అనసూయ వ్యాఖ్యానించారు. సమాజంలో భాగమైన తనకు కూడా ఓ మంచి నాయకుణ్ని ఎన్నుకునే బాధ్యత ఉందన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ తనకు రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదని, కేవలం నాయకులనే పని అని, పవన్ కల్యాణ్ గొప్ప నాయకుడు అని, ఆయన పిలిస్తే ప్రచారం చేయడానికి తప్పకుండా వెళతానని చెప్పారు. జబర్దస్త్ లో చేసే సమయంలో నాగబాబు, రోజా.. ఇద్దరితో బాగా కలిసి పనిచేశానని, ఇద్దరూ తనకు ఎంతో సన్నిహితంగా ఉండేవారన్నారు.
రోజా, నాగబాబు.. ఇద్దరూ పిలిస్తే తప్పకుండా రెండు పార్టీల్లోకి వెళతానని, అది తన ఆసక్తిని బట్టి ఉంటుందన్నారు. తనకుండే అజెండాను బట్టి తన మద్దతు ఉంటుందన్నారు. సినిమా ప్రభావం బాగా ఉంటుందని, జనసేన నుంచి ప్రచారం చేయమని అడిగితే తప్పకుండా చేస్తానన్నారు. తాను ప్రచారానికి వెళితే మాత్రం అన్నీ తెలుసుకునే వెళతానన్నారు. వాస్తవానికి తనకు రాజకీయాలంటే ఇష్టంలేదని, తన నాన్న రాజకీయాలు మానేయడానికి కూడా తానే కారణమన్నారు. మంచి లీడరును ఎన్నుకోండని వేరేవారికి తాను చెప్పడం అనేది తన అదృష్టమని, తాను చెబితే వింటారు కాబట్టి సరిగ్గా చెప్పాలని, వారు వింటారు కదా అని ఏదిపడితే అది చెప్పకూడదన్నారు.

ఓ వార్తా ఛానల్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ జబర్దస్త్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం యాంకరింగ్ ను మానేసి సినిమాలు చేస్తోంది. పుష్ప, రంగస్థలం, యాత్ర, రంగమార్తాండ, క్షణం లాంటి సినిమాల్లో నటించి బిజీ ఆర్టిస్టుగా మారింది. ప్రస్తుం రజాకార్ విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. పుష్ప2 చేస్తోంది. తాజాగా అరి చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications