హీరోయిన్స్ చేతికి చిక్కిన టీడీపీ నేత బండారు..!!
టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై నటీమణులు తీవ్రంగా స్పందిస్తున్నారు. మంత్రి రోజా పై బండారు చేసిన వ్యాఖ్యలైన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి రోజా పైన టీడీపీ నేత బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ సభ్యురాలు, నటి నవనీత్ కౌర్, రాధిక, ఖుష్బూ సహా పలువురు... టీడీపీ నేత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి మీనా.. రమ్యకృష్ణ స్పందించారు.
క్షమాపణ చెప్పాలి: మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలపై నటీమణులు మండిపడుతున్నారు. ఒకరి తరువాత మరొకరు బండారును టార్గెట్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ మీనా ఈ వ్యవహారం పైన సీరియస్ గా స్పందించారు. బండారు వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి. బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో అర్థమవుతోంది. ఆయన వ్యాఖ్యలు అభద్రత భావం, అసూయకి నిదర్శనంగా నిలుస్తున్నాయి. బండారుపై సుప్రీంకోర్టు స్పందించి చర్యలు తీసుకోవాలి.… pic.twitter.com/kLoLQTQuOw
— YSR Congress Party (@YSRCParty) October 8, 2023
సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి రోజా సినీ ఇండస్ట్రీకి వచ్చిన సమయం నుంచి తనకు తెలుసన్నారు. రోజా చిత్తశుద్దితో హార్డ్ వర్క్ చేసే మహిళగా పేర్కొన్నారు. రోజా నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళాగా అన్నింటా సక్సెస్ అయిన వ్యక్తిగా వివరించారు. మంత్రి రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా మాట్లాడే బండారు లేదని మీనా ఆగ్రహం వ్యక్తం చేసారు.
చర్యలు తీసుకోవాలి: బండారు లాంటి వాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడిపోతారుకుంటున్నారా అని ప్రశ్నించారు. మంత్రి రోజా చేసే పోరాటానికి తాను మద్దతుగా నిలుస్తానని మీనా తన మద్దతు ప్రకటించారు. ఇదే అంశం పైన రమ్యకృష్ణ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. మహిళలపై శారీరక, మానసిక హింసను అందరూ వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు.
రోజాపై ఇష్టారీతిన మాట్లాడిన బండారుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. భారత మాతాకి జై అని గర్వంగా చెప్పుకొనే మన దేశంలో ఒక మహిళపై ఇం నీచంగా మాట్లాడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్ తో సంబంధం లేకుండా బండారు వ్యాఖ్యలను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
— Ramya Krishnan (@meramyakrishnan) October 7, 2023
అండగా నిలుస్తాం: ఒక మహిళగా, నటిగా, స్నేహితురాలిగా మంత్రి రోజాకు అండగా ఉంటానని చెప్పారు. నీచమైన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణను క్షమించకూడదన్నారు. ప్రధాని మోదీ, సీఎం జగన్ ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ రమ్యకృష్ణ డిమాండ్ చేసారు. ఇదే అంశం పైన టీడీపీ మాజీ మహిళా నేత కవిత స్పందించారు.

మహిళా మంత్రి రోజా పై బండారు హేయంగా మాట్లాడారని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను భువనేశ్వరి, బ్రాహ్మణి వెంటనే ఖండించాలని డిమాండ్ చేసారు. దరిద్రపు మాటలు ఎలా మట్లాడారో తెలియటం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బండారు పై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications