Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షర్మిల మౌనమెందుకు?: గీతాంజలి మరణంపై పూనమ్ కౌర్ తీవ్ర స్పందన

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న తెనాలి వివాహిత గీతాంజలి మరణంపై సినీ నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఈ ఘటనపై స్పందించలేదంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు. సాటి మహిళలు, పిల్లల పట్ల దయాగుణంలో ఉండడమే స్త్రీ నాయకత్వానికి ప్రధాన లక్షణమని పూనమ్ కౌర్ అన్నారు.

గీతాంజలి మృతి ఘటనపై మహిళా నేతగా కొనసాగుతున్న వైఎస్ షర్మిల స్పందించకపోవడం తనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని పూనమ్ కౌర్ అసహనం వ్యక్తం చేశారు. తెనాలికి చెందిన సాధారణ మహిళలు, బాలికలు బయటకు వచ్చి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

actress poonam kaur reacts on geetanjali death is criticized ys sharmila for not respond

గీతాంజలి మరణానికి కారణమైనవారిని గుర్తించి శిక్షించాలని పూనమ్ కౌర్ డిమాండ్ చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసింది ఎవరనేది తనకు అయోమయంగా మారిందని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు. ఒక పార్టీకి చెందిన ట్రోలర్‌లా, లేక కనిపించకుండా పోయిన వాలంటీరా? అనేది తనకు అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు.

నిందితులను గుర్తించి శిక్షించాలని, గీతాంజలి పిల్లలకు న్యాయం చేయాలని పూనమ్ కౌర్ డిమాండ్ చేశారు. కాగా, గీతాంజలి మరణానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణుల సోషల్ మీడియా ట్రోలింగ్ కారణమంటూ అధికార వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధంలేదని టీడీపీ, జనసేన పార్టీల నేతలు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. గీతాంజలి కుటుంబానికి రూ. 20 లక్షల సాయం ప్రకటించారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+