Anandaiah Medicine In Chittoor: ప్రారంభమైన సరఫరా..ఇంటింటికీ పంపిణీలో వారిదే కీలక పాత్ర..!

కరోనావేళ వెలుగులోకి వచ్చిన ఆనందయ్య ఆయుర్వేదం మందును కొందరు ఆకాశానికి ఎత్తేయగా మరికొందరు కరోనాకు అది మందుకాదంటూ విమర్శించారు. అయితే ఆనందయ్య మందు గురించి తెలుసుకున్న ప్రజలు మాత్రం కృష్ణపట్నంకు క్యూ కట్టారు. అయితే ఈ మందుకు సంబంధించి ఆయుష్ కమిషనర్ కూడా రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. ఆనందయ్య మందులో ఎలాంటి హానికరమైన పదార్థాలు లేవని తేల్చి చెప్పారు. హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలుకాగా దీంతో ఓ వారం రోజుల పాటు మందు పంపిణీకి బ్రేక్ పడింది. కేసును విచారణ చేసిన హైకోర్టు కళ్లల్లో వేసే మందుకు అనుమతి నిరాకరిస్తూ మిగతా మందులు పంపిణీకి ఆమోదం తెలిపింది. దీంతో నిన్నటి నుంచి నెల్లూరులో ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభమైంది.

Recommended Video

    #Krishnapatnam Medicine 'Oushadha Chakra' Distribution అన్ని జిల్లాలకు మందు పంపిణీ | Oneindia Telugu

    తన మందు ముందుగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు మాత్రమే పంపిణీ చేసేవారమని చెప్పారు. ముందు సర్వేపల్లిలోని ప్రతి కుటుంబానికి మందు పంపిణీ జరిగేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఇక ఇతర ప్రాంతాలకు మందు పంపిణీ జరగాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉందని అంతవరకు వేచిచూడాలని చెప్పారు. ఆనందరావు మెడిసిన్ గురించి తెలుసుకున్న తెలుగు రాష్ట్ర ప్రజలు నేరుగా కృష్ణపట్నంకు క్యూ కట్టడంతో అక్కడ మూడు కిలోమీటర్ల మేరా భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతేకాదు మందు పంపిణీ కేంద్రం వద్ద కూడా ప్రజలు భారీగా గుమికూడారు. ఈ క్రమంలోనే కరోనా సూపర్ స్ప్రెడర్‌గా ఈ కేంద్రం మారే అవకాశం ఉందని భావించిన కలెక్టర్ మందు పంపిణీ నిలిపివేయాలంటూ మే 21 ఆదేశాలు ఇచ్చారు. దీంతో మందు పంపిణీకి బ్రేక్ పడింది.

    After a week break, Anandaiah Medicine to be distributed in Chittoor district from Monday

    ఇక ఆయుష్ నివేదికతో మే 30వ తేదీన ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే కళ్లల్లో వేసే డ్రాప్స్‌కు మాత్రం అనుమతి నిరాకరించింది.ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్న వారికి ఈ డ్రాప్స్ వేయడం జరుగుతోంది. ఇక ఈ మందును తీసుకుంటున్న కరోనా పేషెంట్లు డాక్టర్లు సూచించిన అలోపతి మందులు కూడా వాడాలని ప్రభుత్వం వెల్లడించింది. అయితే కళ్లల్లో వేసే డ్రాప్స్ పై కచ్చితమైన నివేదిక అందాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఆనందయ్య తన మందులో వినియోగించే పదార్థాలు ఎలాంటి హాని చేయవని చెప్పిన అధికారులు... స్వతహాగా ఆనందయ్య ఆయుర్వేదిక్ ప్రొఫెషనల్ కాదని చెప్పారు.

    ఇక సోమవారం నుంచి చిత్తూరు జిల్లాలో కూడా ఆనందయ్య మందు తయారు చేసి పంపిణీ చేయనున్నారు. మందు తయారీ కోసం ఈ జిల్లాలోని చంద్రగిరి మండలంను ఎంపిక చేసుకున్నారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్ నేతృత్వంలో ముక్కోటి తీర్థంలో ఔషధం తయారీ చేయనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఔషధం పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఆరు మండలాల్లో ఒక్కో వారం ఒక్కో మండలానికి ఔషధంను సరఫరా చేసేందుకు ఆనందయ్య కుటుంబం కసరత్తు చేస్తోంది. మండలాల నుంచి గ్రామ పంచాయతీలకు మెడిసిన్ సరఫరా చేయాలని భావిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఔషధం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+