శేఖర్ రెడ్డి షాకింగ్: రూ.1000 కోట్ల ఆస్తిపత్రాలు స్వాధీనం, టిటిడి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు
శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు వరుసగా నాలుగో రోజైన ఆదివారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ శాఖ చేపట్టిన సోదాల్లో కళ్లు చెదిరేలా ఆస్తులు బయటపడుతున్నాయి.
విజయవాడ/బెంగళూరు: శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు వరుసగా నాలుగో రోజైన ఆదివారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ శాఖ చేపట్టిన సోదాల్లో కళ్లు చెదిరేలా ఆస్తులు బయటపడుతున్నాయి.
ఇప్పటి వరకు 170 కిలోల బంగారం, రూ.131కోట్ల నగదు, రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వేలూరులో శేఖర్ రెడ్డి, ఆయన సంబంధీకుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

టిటిడి బోర్డు మెంబర్‌గా ఔట్
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డిని తొలగించారు. ఆయన నివాసంలో పెద్ద ఎత్తున నల్ల ధనం, బంగారం బయటపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను టిటిడి సభ్యుడి పదవి నుంచి తొలగిస్తూ ఆదివారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications