దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్టు వైరల్

టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ మెహర్ రమేశ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మెహర్ జ్యోతి సుంకర ఇటీవల జూలై 21 న ఆకస్మిక మరణం చెందారు. అయితే తాజాగా అక్కను తలచుకుని మెహర్ రమేశ్ భావోద్వేగ పోస్టు పెట్టారు. తన సోదరి ఆకస్మిక మరణంతో తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయిన ఆయన.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులు అర్పించారు. ఇక సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టు అభిమానులను కదిలిస్తోంది.

అలాగే అక్క మెహర్ జ్యోతితో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఫొటోలను షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో దిగిన చిన్నప్పటి ఫొటోలను కూడా అభిమానులతో ఆయన పంచుకున్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబుతో ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. అలాగే మెహర్ రమేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోను కూడా షేర్ చేశారు.

ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'హృదయం మురళి'
ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'హృదయం మురళి'

ఈ మేరకు తమకు కష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి ధైర్యం చెప్పిన బంధువులు, ఆ సమయంలో ఫ్యాన్స్ చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని స్పష్టం చేశారు. అక్క జ్ఞాపకాలు ఎప్పటికీ తమ హృదయాల్లో నిలిచిపోతాయని.. ఆమె ప్రేమ, ఆప్యాయత జీవితాంతం వెంట ఉంటాయని భావోద్వేగంగా స్పష్టం చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

MeherRamesh Deep tragedy strikes director family emotional post about his sister passing goes viral

ఇక మెహర్ జ్యోతి సుంకర గత కొంతకాలంగా వైరల్ న్యూమోనియాతో పోరాడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. అయితే వైద్యులు ఆమెను బతికించేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. ఆమె ఇటీవల కన్నుమూశారు. దాంతో మెహర్ రమేశ్ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి మెహర్ రమేశ్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మొత్తానికి ఈ పోస్టు అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+