హైద్రాబాద్‌కు బాబు ఎంతో చేశారు: అజయ్ దేవగణ్, బాలీవుడ్‌ను దింపిన సీఎం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, ఆయన సతీమణి కాజోల్ బుధవారం నాడు ప్రశంసలు కురిపించారు. హైదరాబాదును చంద్రబాబు బాగా అభివృద్ధి చేశారని కితాబిచ్చారు.
మంగళవారం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో అజయ్ దేవగణ్, కాజోల్ కలిశారు. వారిని ఏపీ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

గతంలో చంద్రబాబు హైదరాబాదును బాగా అభివృద్ధి చేశారని చెప్పారు. అలాగే ఇప్పుడు అమరావతి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేయడానికి సమర్థులు అని చెప్పారు. ఏపీని విలక్షణంగా తీర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. వారు బ్రాండ్ అంబాసిడర్లుగా స్వచ్ఛంగా ముందుకు రాగా.. చంద్రబాబు అంగీకరించారని తెలుస్తోంది.
తెలుగు వాళ్లను కాదని...
టాలీవుడ్‌లో ఎందరో నటులు ఉండగా బాలీవుడ్ దంపతులను పర్యాటక బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసుకోవడం గమనార్హం. అజయ్ దేవగణ్ దంపతులను అంబాసిడర్లుగా చేయడం వెనుక.. వారు స్వచ్ఛంధంగా ముందుకు రావడమేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications