ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏ హోదాలో, నేను ఉండగా.. ఎలా?: చంద్రబాబు ముందు అఖిలప్రియ ప్రశ్నలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్ని విభేదాల పరిష్కారంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం చంద్రబాబుతో భేటీకి రానీ అఖిల.. గురువారం అమరావతికి బయలుదేరారు.
బుధవారం అఖిలప్రియ రాకపోవడంతో ఈ సమావేశం వాయిదాపడింది.

చంద్రబాబు భేష్: కాంగ్రెస్ ముఖ్యనేత షిండే ప్రశంసలు, 'వవన్‌వి నిలకడ లేని రాజకీయాలు'చంద్రబాబు భేష్: కాంగ్రెస్ ముఖ్యనేత షిండే ప్రశంసలు, 'వవన్‌వి నిలకడ లేని రాజకీయాలు'

చంద్రబాబుతో భేటీకి బుధవారమే ఏవీ సుబ్బారెడ్డి ఉండవల్లికి చేరుకున్నారు. కానీ అఖిల గురువారం వస్తానని చెప్పారు. నియోజకవర్గంలో సైకిల్ యాత్ర విజయవంతంగా సాగుతున్నందునే తాను సీఎంతో భేటీకి హాజరు కాలేదని, ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు ముందుగా చెప్పి అనుమతి తీసుకున్నానని ఆమె వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి.

ఆడపిల్లను కాబట్టేనని అఖిలప్రియ

ఆడపిల్లను కాబట్టేనని అఖిలప్రియ

ఏవీ సుబ్బారెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొనడం ఇష్టంలేకే హాజరు కాలేదన్న విమర్శలను అఖిలప్రియ తోసిపుచ్చారు. చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఎవరు ఉన్నా తనకు అభ్యంతరం లేదన్నారు. సీఎం ఏం చెప్తే అలా చేస్తామన్నారు. తాను ఎవరి పైనా వ్యక్తిగత విమర్శలు చేయనని చెప్పారు. ప్రజలే తమకు అండ అన్నారు. తాను ఆడపిల్లను కాబట్టి ఆయన లక్ష్యంగా చేసుకున్నారన్నారు.

 ఇదీ ఏవీ సుబ్బారెడ్డి వాదన

ఇదీ ఏవీ సుబ్బారెడ్డి వాదన

తనపై ఏవీ సుబ్బారెడ్డి చేసిన విమర్శలకు భూమా అభిమానులు స్పందించి ఉంటారని, అంతేకానీ ఏవీపై జరిగిన రాళ్ల దాడి తన ఆదేశాలతో జరిగింది మాత్రం కాదని అఖిలప్రియ చెప్పినట్లుగా తెలుస్తోంది. తమకు అండగా ఉండాల్సింది పోయి, ధర్మపోరాట దీక్ష సమయంలో గొడవలు చేయించే ప్రయత్నం చేశారన్నారు. మరోవైపు, భూమా నాగిరెడ్డితో తనకు మంచి సంబంధాలు ఉండెనని, ఆయన మృతి తర్వాత అఖిల నియంతలా వ్యవహరిస్తున్నారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.

ఏ హోదాలో ఏవీ సుబ్బారెడ్డి వస్తున్నారు?

ఏ హోదాలో ఏవీ సుబ్బారెడ్డి వస్తున్నారు?

ఆళ్లగడ్డలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య గొడవపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరితో చంద్రబాబు ఈ సాయంత్రం భేటీ కానున్నారు. కాగా, ఈ సమావేశం సందర్భంగా భూమా వర్గం కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లుగా తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డిని ఏ హోదాలో సమావేశానికి ఆహ్వానిస్తున్నారనేది వారి ప్రశ్నగా తెలుస్తోంది.

 ఇలాంటివి అధిష్టానం అనుమతించవద్దు

ఇలాంటివి అధిష్టానం అనుమతించవద్దు

ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా నేను ఉండగా అదే నియోజకవర్గంలో మరో నేత సైకిల్ యాత్ర ఎలా చేపడతారనేది అఖిలప్రియ వాదనగా చెబుతున్నారు. ఇలాంటి పరిణామాలను పార్టీ అనుమతించకూడదని భూమా ఫ్యామిలీ కోరుతోందట. ఇలాంటి పరిణామాలను పార్టీ కూడా అనుమతించవద్దని కోరారు. కొంతమంది ప్రోత్సాహం వల్లే ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలలో పార్టీలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మరోవైపు, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకే సైకిల్ యాత్ర చేపట్టానని ఏవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు.

English summary
AP Minister Akhila Priya and Telugudesam Party leader AV Subba Reddy to meet CM Chandrababu Naidu today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X