ఎవరూ చూడని సమయంలో బాలయ్య కన్నీరు పెట్టుకున్నారు
తారకరత్న మరణించి నెలరోజులు గడుస్తున్నా మరిచిపోని అభిమానులు
నందమూరి తారక రత్న మృతిచెంది రోజులు గడుస్తున్నా అభిమానులుఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన భార్య అలేఖ్య రెడ్డి కూడా తారకరత్నను తలచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా ఆమె బాలకృష్ణ ను ఉద్దేశిస్తూ ఓ భావోద్వేగానికి గురయ్యే పోస్టు పెట్టారు. ఆపదలో ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు అండగా ఉన్నారని తలచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఓ అభిమాని ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేస్తూ అతడికి ధన్యవాదాలు తెలిపారు.
మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి బాలకృష్ణ అని, మంచి చెడు రెండు సమయాల్లో మాకు కొండంత అండగా ఉన్న ఒకే ఒక వ్యక్తి అని, తారకరత్నను ఆసుపత్రికి తీసుకువెళ్లి తండ్రిలా చూసుకున్నారన్నారు. ఆసుపత్రి బెడ్ పై తన పక్కన కూర్చొని ఒక తల్లిలా పాట పాడారు. తను ఉన్నఒకే ఒక వ్యక్తి తారకరత్న. తాను ప్రతిస్పందించాలని ప్రయత్నం చేస్తూ జోక్స్ చెప్పారు.. ఎవరూ చూడనప్పుడు కన్నీరు పెట్టుకున్నారు.. ఇలా అన్నివేళలా ఆయన తమవెంటే ఉన్నారన్నారు. ఈ ఫొటోను ఎవరు ఎడిట్ చేశారో తెలియదుకానీ వారికి తన ధన్యవాదాలు అంటూ తారకరత్న పిల్లలతో బాలకృష్ణ ఉన్న ఫొటోను షేర్ పచేశారు అలేఖ్యారెడ్డి, ప్రస్తుతం
తారకత్న, పిల్లలతో బాలకృష్ణ ఉన్న ఫొటోను షేర్ చేశారు. తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటి నుంచి బాలకృష్ణ ఆ కుటుంబానికి అండగా ఉంటున్న సంగతి తెలిసిందే.

నారా లోకేష్ యువగళం పాదయాత్ర తొలిరోజు కార్యక్రమానికి తారకరత్న హాజరయ్యారు. మధ్యాహ్న సమయానికి అనారోగ్యంతో సొమ్మసిల్లి పడిపోగా కుప్పంలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. అప్పటికీ మెరుగైన వైద్యం అవసరమవడంతో బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించి చికిత్సనందించారు. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. తర్వాత 24 రోజులపాటు చికిత్స తీసుకున్న తారకరత్న చివరకు కన్నుమూశారు. ఆ సమయంలో వారి కుటుంబానికి తమ కథానాయకుడు బాలకృష్ణ అండగా నిలబడ్డారంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications